Begin typing your search above and press return to search.
బొగ్గు కుంభకోణం : మన్మోహన్ పై కేసు
By: Tupaki Desk | 21 Sep 2015 4:15 PM GMTజిందాల్ గ్రూపులకు బొగ్గు క్షేత్రాలు కేటాయించిన కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను సీబీఐ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిందాల్ కేసులో అప్పుడు బొగ్గుశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నిర్ణయాలన్నీ మన్మోహన్ సింగే తీసుకున్నారని మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు సీబీఐ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు దాసరి తరఫున ఆయన న్యాయవాది కోర్టులో దాఖలు చేశారు.
అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలోనే బొగ్గు క్షేత్రాల కేటాయింపులు జరిగాయని ఈ కేసుకు సంబంధించి మన్మోహన్ సింగ్ ను విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని అందులో పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణం విషయంలో జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా వాదనలను దాసరి సమర్ధించారు. అప్పటి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న శిబుసోరెన్ జైలుకు వెళ్లడంతో ఆ శాఖను మన్మోహన్ సింగే చూశారని, తాను కేవలం సహాయ మంత్రిగా ఉన్నానని దాసరి ఆ లేఖలో వెల్లడించారు. మన్మోహసింగ్ ఆదేశాల మేరకే బొగ్గు కేటాయింపులు జరిగాయని దాసరి స్పష్టం చేశారు.
మన్మోహన్ సింగ్ పై కేసు నమోదు సమయంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. ప్రధానమంత్రిగా చేసిన మన్మోహన్ ను కూడా బొగ్గు కుంభకోణం కేసులో నిందితుడిగా చేర్చడం అంటే కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని పార్టీ అగ్రనేతలు మండిపడ్డారు. తాజాగా దాసరి లిఖిత పూర్వక సమాధానం నేపథ్యంలో కేసకు ఆసక్తికర మలుపులు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.