Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు.... ఆగ‌స్టు 25న సీబీఐ కోర్టు తీర్పు!

By:  Tupaki Desk   |   30 July 2021 3:17 PM GMT
జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు.... ఆగ‌స్టు 25న సీబీఐ కోర్టు తీర్పు!
X
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై తుది విచారణను సీబీఐ కోర్టు ఆగష్టు 25కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించి శుక్ర‌వారం సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అయితే.. కోర్టు విచక్షణ అధికారాలకే నిర్ణయం వదిలేసామని... తాజా కౌంట‌ర్‌లోనూ సీబీఐ పేర్కొంది. దీంతో దీనిని పరిగణన‌లోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. తుది తీర్పును ఆగ‌స్టు 25న వెల్ల‌డిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇదిలావుంటే.. ఈ పిటిష‌న్‌పై జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు. ఈ మూడింటిని సీబీఐ కోర్టు పరిగణన‌లోకి తీసుకుంది.

గతంలో జగన్, పిటిషనర్ ర‌ఘురామ‌రాజు తరపు న్యాయవాదులు రిజైండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారం వదిలేస్తున్నామని... బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజైండర్‌లో పేర్కొన్నారు. అయితే.. అదే విషయాన్ని లిఖిత పూర్వ‌కంగా ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని ఈరోజు సీబీఐ తరపు న్యాయవాదలు వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు విచారణను ఆగష్టు 25కు వాయిదా వేసింది. అదే రోజు తీర్పు వెలువడే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి. ఇక‌, ఈ పిటిష‌న్‌లో ర‌ఘురామ వాద‌నలు బ‌లంగా ఉన్న‌ట్టు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

43 వేల కోట్ల అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించిన కేసులో జ‌గ‌న్ 16 నెలలు జైలు చేయ‌డం.. త‌ర్వాత బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యాన్ని ర‌ఘురామ‌.. కోర్టుకు వివ‌రించారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌.. బెయిల్ పై ఉన్న‌ప్ప‌టికీ.. కీల‌క‌మైన ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్నార‌ని.. ఆయ‌న త‌న కేసుల‌కు సంబందించిన సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌న్న‌ది ర‌ఘురామ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అంతేకాదు.. ఈకేసులో నిందితులుగా ఉండి.. గ‌తంలో జైలుకు వెళ్లి.. బెయిల్‌పై వ‌చ్చిన ఐఏఎస్ అధికారుల‌కు ఆయ‌న త‌న ప్ర‌భుత్వంలో కీల‌క పోస్టులు ఇచ్చార‌ని.. అదేవిధంగా ప‌లువురు నేత‌ల‌కు కూడా కీల‌క‌మైన రాజ‌కీయ ప‌ద‌వులు ఇచ్చార‌ని,.. ఇవ‌న్నీ..కూడా సాక్షుల‌ను ప్ర‌భావితం చేయ‌డం కింద‌కే వ‌స్తాయ‌ని ర‌ఘురామ వివ‌రించారు.

ఇక‌, జ‌గ‌న్ త‌ర‌ఫున వాద‌న‌లు ప‌రిశీలిస్తే.. త‌న‌పై దాఖ‌లుచేసిన పిటిష‌న్ కేవ‌లం.. రాజ‌కీయ దురుద్దేశంతో కూడుకున్న‌ద‌ని.. దీనికి ప్రాధాన్యం ఏమీలేద‌ని.. సీఎంగా ఉన్నంత మాత్రాన బెయిల్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌లేద‌ని.. జ‌గ‌న్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు కోర్టుకు వివ‌రించారు. అదేస‌మ‌యంలో సీబీఐ.. కేసులు న‌మోదు చేయ‌డంతో.. ఆ సంస్థ కూడా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని.. కోర్టు ఆదేశించ‌డంతో.. సీబీఐ కూడా కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. అయితే.. కోర్టు విచ‌క్ష‌ణ మేర‌కు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని చెప్ప‌డం ఇక్క‌డ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించాల్సిన విష‌యం. అంటే.. జ‌గ‌న్ బెయిల్ కండిష‌న్ల‌ను ఉల్లంఘించార‌ని కానీ,.. ఆయ‌న సాక్షుల‌ను ప్ర‌భావితం చేశార‌ని కానీ.. సీబీఐ చెప్ప‌లేదు. అలాగ‌ని.. బెయిల్ ర‌ద్దు చేయొద్ద‌నికానీ.. కోర‌లేదు. సో..

ఈ ప‌రిణామాలు.. జ‌గ‌న్ అనుస‌రించిన విధానాల‌ను గమ‌నిస్తే.. సీబీఐ కోర్టులో ర‌ఘురామ పిటిష‌న్ బ‌లంగా ఉంద‌ని అర్ధ‌మ‌వుతోంది. మ‌రి తుదితీర్పు ఎలా ఉంటుంద‌నేది తెలియాలంటే ఆగ‌స్టు 25 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.