Begin typing your search above and press return to search.
సీబీఐ కి పాఠాలు నేర్పిన సత్యం
By: Tupaki Desk | 10 April 2015 7:54 AM GMTఅతడు సినిమాలో ఒక కేసుకు సంబందించిన ఫైల్ ను సీబీఐ ఆఫీసర్ ప్రకాశ్ రాజ్ కు, తన పై అధికారి హోదాలో ఉన్న విశ్వనాథ్ గారు అందించినప్పుడు... "ఈ కేసుకు సంబందించిన ఈ పుస్తకం లాంటి ఫైలు చదవడానికే చాలా రోజులు పడుతుంది అంటారు దీనంగా ముఖ్యం పెట్టి. సత్యం కుంభకోణానికి సంబందించిన కేసు ఫైల్ చూసినప్పుడు కూడా సీబీఐ అధికారుల పరిస్థితి అదేనేమో! కానీ... ఈ కేసు దర్యాప్తును విజయవంతంగా పూర్తిచేసిన అధికారులు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.
సత్యం కంపూటర్స్ కుంభకోణం వల్ల అటు అవినీతికి పాల్పడాలనుకునే బడా పారిశ్రామిక వేత్తలకు, వారిని తప్పుదోవపట్టడానికి సహకరించే కొందరు ఆడిటర్లకు చాలా పాఠాలు నేర్చుకోవచ్చని అటు మీడియా, ఇటు విశ్లేషకులు ఊదరగొడుతున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే... సత్యం కుంభకోణం వల్ల మేము కూడా చాలా కొత్త పాఠాలు నేర్చుకున్నామని, ఎన్నో కొత్త విషయాలు తెలిసాయని అంటున్నారు సత్యం కుంభకోణం దర్యాప్తు విషయంలో పనిచేసిన సీబీఐ అధికారులు. సామాన్యులకు, ఒక మోస్తరు తెలివైన వారికి ఏమాత్రం అర్థం అవకుండా ఉండే ఈ క్లిష్టమైన కేసును దర్యాప్తు చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలిసాయని, అనేక క్లిష్టమైన ఆర్థిక అంశాలతో ముడిపడిన కేసు కావడంతో అసలు ఈ కేసును అర్థం చేసుకోవడానికే చాలా కష్టం అయ్యిందని అంటున్నారు దర్యాప్తు బృందం అధికారులు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం అని పలువురు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా... సత్యం కుంభకోణం వల్ల చాలా మందికి చాలా పాఠాలు తెలిసాయి... కాదు బాగా అర్థం అయ్యాయి!