Begin typing your search above and press return to search.
బ్లాక్ మనీకి షార్ట్ కట్ దొరికింది
By: Tupaki Desk | 26 Nov 2016 4:44 PM GMTశతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్న సామెతను నల్ల కుబేరులు ఆచరణలో చూపిస్తున్నారు. నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు వీలైనన్ని అవకాశాలు వెతుక్కుంటున్న బ్లాక్ మనీ బడాబాబులు ఈ క్రమంలో బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకు మేనేజర్లను ఉపయోగించుకున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో ఫలితం రాకపోవడంతో...లేటెస్టుగా పోస్టాపీసులపై కన్నేశారు. తాజాగా హైదరాబాద్‌లోని పలు పోస్టాఫీసులపై సీబీఐ జరిపిన దాడులే ఇందుకు నిదర్శనం.
నల్లధనాన్ని మార్చుకునే క్రమంలో బ్లాక్ మనీదారులు ఆయా బ్యాంకుల్లో ఆపరేట్ చేయని అకౌంట్లను వరంగా మార్చుకొని దందాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది బ్యాంకు అధికారులే బడా బాబులకు ఫోన్ చేసి నగదు అందుబాటులో ఉందని, వచ్చి మార్చుకోవాలని ఆఫర్లు ఇస్తున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే సామాన్యులకు నగదు సరిగా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఈ కొత్త దందా ఈ విధంగా నడుస్తుందని సీబీఐ వర్గాలు అంటున్నారు. మొదట బ్యాంకులలో ఆపరేట్ చేయని అకౌంట్లను గుర్తిస్తారు. తర్వాత ఈ విషయాన్ని బడా బాబులకు చేరవేసి నగదును సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తారు. అనంతరం ఆయా అకౌంట్లలో నగదును డిపాజిట్ చేస్తారు. ఈ విషయం అకౌంట్ హోల్డర్స్‌కు తెలియదు. ఎవరెవరి అకౌంట్లలో ఎంత సొమ్ము ఉన్నదన్న సమాచారాన్ని కేవలం ఆర్బీఐకి మాత్రమే పంపిస్తారు. కాబట్టి ఇటు బ్యాంకులో పనిచేసే క్లరికల్ సిబ్బందికి, అటు అకౌంట్ హోల్డర్స్‌కు సమాచారం తెలిసే అవకాశం లేదు. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆయా బ్యాంకులకు నగదు చేరగానే డిపాజిట్ చేసిన మొత్తాన్ని డ్రా చేసుకుంటారు. ఈ విధంగా నల్లధనం తెల్లధనంగా మారినట్టే. ఇందుకుగాను బ్యాంకులలో పనిచేసే అధికారులు కొంత సొమ్మును కమీషన్‌గా తీసుకుంటారు. ముఖ్యంగా మొదటి దఫాగా వచ్చిన నూతన కరెన్సీలో ఎక్కువ భాగం పెద్దల వద్దకే చేరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల్లో ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకుల్లో ఇలాంటి దందాలు ఎక్కువగా జరిగే అవకాశముందని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలాఉండగా బ్యాంకుల్లో జరిగిన ఇలాంటి దందా తేటతెల్లం కావడంతో సదరు బడాబాబులు పోస్టాఫీసులను ఈ వ్యవహారాలకు కేంద్రంగా ఎంచుకున్నారు. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో సీబీఐ దాడులు జరిపింది. ఇలా ఇప్పటికే సీబీఐ నిర్వహించిన సోదాల్లో పోస్టాఫీసుల్లో దాదాపు రూ.40లక్షల నల్లధనం తెల్లధనంగా మారినట్టు వెలుగుచూసింది. త్వరలో మరిన్ని పోస్టాఫీసులపై సీబీఐ దాడులు జరపనున్నట్లు తెలుస్తోంది.