Begin typing your search above and press return to search.
అరకు ఎంపీకి సీబీఐ కోర్టు సమన్లు
By: Tupaki Desk | 13 Aug 2015 6:28 AM GMTవిశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలపై ఆమెపై గతంలో కేసు నమోదుకాగా..ఈ కేసు విషయమై ఈ నెల 19న కోర్టుకు హాజరు కావాలంటూ ఆ సమన్లలో పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆమె నకిలీ ధృవపత్రాలు సమర్పించి రూ.42 కోట్ల రుణం పొందారని ఆమెపై చార్జిషీటు దాఖలు చేశారు.
విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ కంపెనీకి గతంలో గీత భర్త పి.రామకోటేశ్వరరావు ఎండీగా ఉన్నారు. ఆ టైంలో ఆమె తన భర్తతో కలిసి ఈ మోసాలకు పాల్పడినట్టు సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. వీరు రుణం తీసుకున్నాక దాన్ని ఇతర అవసరాలకు కూడా వాడినట్టు తెలిపింది. వీరిద్దరి మోసం వల్ల బ్యాంకుకు రూ.42.79 కోట్ల నష్టం వాటిల్లినట్టు సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్‌కె.గౌర్ చెప్పారు.
నాడు పంజాబ్ నేషనల్ బ్యాంకు హెడ్ ఆఫీస్ జీఎం అరవిందక్షణ్, అప్పటి అసిస్టెంట్ జీఎం బీకే జయప్రకాష్ తదితరులు కూడా వీరికి సహకరించి బ్యాంకును మోసం చేశారని సీబీఐ వీరిపేర్లను కూడా చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ నలుగురు నిందితులపై సీబీఐ ఈ క్రింది కేసులు నమోదు చేసింది.
120 బీ - నేరపూరిత కుట్ర
రెడ్ విత్ 420 - చీటింగ్
468 - ఫోర్జరీ
ఐపీసీ 471 యాక్ట్ కింద 1988లోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(డీ) కింద అభియోగాలు నమోదు చేసినట్టు గౌర్ తెలిపారు.
గీత అంతకు ముందు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు. ఎన్నికల్లో వైకాపా తరపున ఆమెకు ఎంపీ టిక్కెట్టు రావడంతో బ్యాంకు నుంచి పొందిన నిధులను ఎన్నికల కోసం ఖర్చుచేసినట్టు కూడా ఆమెపై వార్తలొచ్చాయి.