Begin typing your search above and press return to search.

సీబీఐకి భారీ షాక్.. 40వేల సాక్ష్యాలు.. 100 ఆడియో - వీడియో టేపులు నిరాధారం!

By:  Tupaki Desk   |   30 Sep 2020 5:55 PM GMT
సీబీఐకి భారీ షాక్.. 40వేల సాక్ష్యాలు.. 100 ఆడియో - వీడియో టేపులు నిరాధారం!
X
సీబీఐ చరిత్రలోనే అత్యంత సుధీర్ఘంగా సాగిన కేసుల్లో బాబ్రీ మసీదు కేసు ఒకటి. అయితే సీబీఐ నేరపూరిత కుట్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులందరినీ కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుతో సీబీఐకి భారీ షాక్ తగిలినట్టైంది.

1992 డిసెంబర్ 6.. హిందువుల గుంపు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టింది. ఇది శ్రీరాముడు జన్మించిన స్థలంగా.. రామజన్మభూమిగా హిందువులు భావించారు. ఇక్కడ హిందూ దేవాలయాన్ని కూలగొట్టి ముస్లిం రాజులు బాబ్రీ మసీదు కట్టారని ఈ చర్యకు పాల్పడ్డారు. బాబ్రీ మసీదు కూలగొట్టడంతో దేశంలో మత కల్లోలాలు చెలరేగాయి. దేశవ్యాప్తంగా అల్లర్లలో 2000 మంది చనిపోయారు.

1993 ఆగస్టు 27న బాబ్రీ మసీదుకు సంబంధించిన అన్ని కేసులను సీబీఐ చేతికి అప్పగించారు. అక్టోబర్ 5న తొలి చార్జీ షీటు వేశారు. మొత్తం 47 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ (92), అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ సహా 49మంది నిందితులు కుట్రకు పాల్పడ్డారని సీబీఐ నిర్ధారించింది. వీరే కరసేవకులను రెచ్చగొట్టి బాబ్రీ మసీదును కూల్చారని దాదాపు 40వేల మంది ప్రత్యక్ష సాక్ష్యాల వాంగ్మూలాలను నమోదు చేసింది సీబీఐ. 100కు పైగా టీవీ ఆడియో, వీడియో టేపులను కోర్టుకు సమర్పించింది. . 29 ఏళ్లుగా కోర్టుల్లో ఈ కేసుపై విచారణ సాగుతోంది.

విశేషం ఏంటంటే సీబీఐ సమర్పించిన ఇన్ని ఆధారాల్లో ఏ ఒక్కటి కూడా నిందితులు నేరం చేశారనే విషయాన్ని రుడీ చేయడం లేదని స్పెషల్ కోర్టు జడ్జి చెప్పడం గమనార్హం. కాగా సీబీఐ కోర్టు తీర్పుపై సవాల్ దిశగా సీబీఐ ఆలోచిస్తున్న ఆ లాయర్ తెలిపారు.