Begin typing your search above and press return to search.
అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు... !?
By: Tupaki Desk | 3 March 2022 7:30 AM GMTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ విచారణ తుది అంకానికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కేసు విషయంలో కీలక వ్యక్తులను విచారించాల్సి ఉందని సీబీఐ ఇప్పటికే కోర్టుకు తెలియచేసిన నేపధ్యంలో తాజాగా ఒక సంచలన విషయం మీద ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతోంది. అదంటి అంటే ఈ కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేస్తుంది అన్నది. ఆయనను విచారించేందుకు నోటీసులు జారీ చేయడానికి సీబీఐ సిద్ద్ధమైనట్లుగా చెబుతున్నారు.
ఇక దీనికి సంబంధించి ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలోని నిన్ననే ఈ ఈ నోటీసులు సిద్ధం చేశారు అని అంటున్నారు. నేడో రేపో పులివెందులలో అవినాశ్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఈ నోటీసులు ఇస్తారని ప్రచారం అయితే సాగుతోంది ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటికే 207మందిని విచారించింది. 146మంది వాంగ్మూలాలు నమోదు చేసింది.
ఇక ఈ కేసులో చాలా మంది ఇచ్చిన వాంగ్మూలాలు సరిచూసుకుని కీలక వ్యక్తులను విచారణకు పిలవాలని సీబీఐ భావిస్తోంది అంటున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారిపోవడంతో పాటు రెండు కీలకమైన వాంగ్మూలాలు ఇచ్చారని తెలుస్తోంది
దాంతో పాటు మరింతమంది ఇచ్చిన వాంగ్మూలాలు కూడా సమీక్షించుకుంటూ సీబీఐ ఒక్కో అడుగూ ముందుకు వేస్తోంది అంటున్నారు. ఇక ఈ కేసు విషయంలో ఇప్పటికే విపక్షాలు వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్న నేపధ్యం ఉంది. అయితే ఇవన్నీ రాజకీయ ఆరోపణలుగానే చూడాలి. కానీ సీబీఐ ఈ కేసు లోతుపాతులలోకి వెళ్ళి అన్నీ పూర్తిగా సమగ్రంగా విచారణ జరుపుతున్న క్రమంలోనే వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇస్తారు అని అంటున్నారు.
సాధారణంగా విచారణ సంస్థలు అనుమానితులను పిలుస్తారు. అలాగే వాంగ్మూలాలలో పేర్కొన్న పేర్లను బట్టి కూడా కొంతమందిని విచారిస్తారు. దాంతో అవినాష్ రెడ్డిని కూడా పిలిచే అవకాశం ఉంది అంటున్నారు.
ఇక అవినాష్ రెడ్డిని విచారణకు ఒక వేళ పిలిస్తే దాన్ని సాధారణ దర్యాప్తుగానే చూడాలా లేక ఇందులో ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకుంటుందా అన్నది అయితే ఆలోచించాలని అంటున్నారు. ఇపుడున్న ఏపీ రాజకీయాలలో అవినాష్ రెడ్డికి నోటీసులు కనుక సీబీఐ ఇస్తే మాత్రం ఈ కేసులో అసలైన వేడి రాజుకున్నట్లుగానే భావించాలని చెబుతున్నారు.