Begin typing your search above and press return to search.

తీవ్ర ఉత్కంఠ : కవిత నివాసంలో సీబీఐ అధికారులు.. ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   11 Dec 2022 10:13 AM GMT
తీవ్ర ఉత్కంఠ : కవిత నివాసంలో సీబీఐ అధికారులు.. ఏం జరుగుతోంది?
X
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఉదయం 11 గంటల నుంచి సీబీఐ అధికారులు ఆమె నివాసంలో విచారిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో కవిత హస్తం ఉందన్న ఆరోపణలతో విచారిస్తున్నారు.

ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు కవిత నివాసానికి చేరుకున్నారు. మహిళా అధికారులతో సహా ఆరుగురు అధికారులు ఉన్నారు. కవిత వెంట న్యాయవాదులు ఉన్నారు. ఇందుకోసం గ్రౌండ్ ఫ్లోర్ లోనే ప్రత్యేక గదిని సిద్ధం చేసిన సిబ్బంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత స్టేట్ మెంట్ ను సీబీఐ బృందం రికార్డ్ చేయనుంది. కవిత విచారణ ప్రారంభమైందని.. సిద్ధం చేసిన ప్రశ్నలను కవితను అడిగినట్టు తెలుస్తోంది. కొన్ని డాక్యుమెంట్లు, కాల్ లిస్ట్ పై అధికారులు ప్రశ్నించారని.. సిసోడియా, అరోరా, అభిషేక్ విషయంలో కవితను సీబీఐ విచారించినట్టు సమాచారం.

సీబీఐ డీఐజీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కవిత విచారణ కొనసాగుతోంది. సీబీఐ బృందంలో 11 మంది అధికారులు ఉన్నారు. కవిత స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. సీబీఐ అడిగే ప్రశ్నలు, కవిత ఇచ్చే సమాధానాలపై ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే కవితకు ఈనెల 6వ తేదీన విచారించాలని సీబీఐ నోటీసులు పంపింది. దానికి ఈనెల 11న అందుబాటులో ఉంటానని కవిత ప్రత్యుత్తరం పంపింది. ఈ నేపథ్యంలో నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కళకళలాడే కవిత నివాసం ప్రాంగణం బోసిపోయింది.

పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి కవితకు సంఘీభావం తెలుపుతున్నారు. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 'వి విత్ యూ కవితక్క' పేరుతో ఆమె ఇంటి చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.