Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్:కేసీఆర్ ను క్వశ్చన్ చేసిన సీబీఐ

By:  Tupaki Desk   |   21 Oct 2015 6:16 AM GMT
హాట్ టాపిక్:కేసీఆర్ ను క్వశ్చన్ చేసిన సీబీఐ
X
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం అంటున్నాయి రాజకీయ వర్గాలు. అత్యంత శక్తివంతమైన ముఖ్యంత్రుల్లో ఒకరిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంగళవారం సీబీఐ క్వశ్చన్ చేయటం సంచలనం రేకెత్తిస్తోంది.

గుట్టుచప్పుడు కాకుండా.. సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చిన సీబీఐ అధికారులు.. సీఎం కేసీఆర్ ను కలిసి ఆయన్ను కొన్ని ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. అయితే.. సీబీఐ తాజా ప్రశ్నలకు కారణం గతమేనని చెప్పొచ్చు. యూపీఏ హయాంలో కేంద్ర కార్మిక మంత్రిగా వ్యవహరించిన కేసీఆర్.. అప్పట్లో తీసుకున్న నిర్ణయమే తాజా ఎంక్వయిరీకి (ప్రశ్నలు వేయటం) కారణంగా చెబుతున్నారు.

కేంద్ర మంత్రిగా కేసీఆర్ వ్యవహరించిన సమయం (2005)లో ఈఎస్ఐ భవన నిర్మాణం కాంట్రాక్ట్ ను నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ సంస్థకు కాకుండా.. ఏపీ ఫిషరీస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఇచ్చారు. ఆ తర్వాత ఈ భవన నిర్మాణ నాణ్యతపై పలు విమర్శలు రావటంతో 2011లో సీబీఐ ఒక కేసు నమోదు చేసింది. అనంతరం ఈ భవనాల్ని పరిశీలించిన ఐఐటీ నిపుణులు .. భవన నిర్మాణంలో నాణత్య ప్రమాణాలు సరిగా లేవని.. రూ.5కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.

దీనికి సంబంధించిన ఉదంతంపై నాటి కార్మిక శాఖలో పని చేసిన అధికారుల్ని విచారించిన సీఐబీ.. కొన్ని సందేహాలు తీర్చుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిందన్నది తాజా కబర్. ఈఎస్ఐ భవనాల నిర్మాణ కాంట్రాక్ట్ ను వేరే వారికి ఎందుకు ఇచ్చారన్న అంశంపై ప్రశ్నించిందని చెబుతున్నారు. రూ.5కోట్ల నష్టానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ క్వశ్చన్లు ఎదుర్కోవాల్సి రావటం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెబుతున్నారు.