Begin typing your search above and press return to search.

రఘురామకు కొరుకుడుపడని సీబీఐ

By:  Tupaki Desk   |   9 July 2021 5:38 AM GMT
రఘురామకు కొరుకుడుపడని సీబీఐ
X
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుకు సీబీఐ వ్యవహారం కొరుకుడు పడటంలేదు. అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను ఎలాగైనా రద్దు చేయించాలని వైసీపీకే చెందిన తిరుగుబాటు ఎంపి రఘురామ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా కోర్టులో కేసులు కూడా వేశారు. తాను కేసు వేయటమే కాకుండా సీబీఐ వాదనలు వినిపించేట్లు చేయాలని ఎంపి అనుకున్నారు.

అయితే ఈ విషయంలో ఎంపికి సీబీఐ పెద్ద షాకే ఇఛ్చింది. బెయిల్ రద్దు విషయాన్ని సీబీఐ కోర్టు విచక్షణకే వదిలేసింది. ఎంపి దాఖలు చేసిన కేసులో మెరిట్ ను చూసి కోర్టే ఓ నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా చెప్పేసింది. తాజాగా జరిగిన విచారణలో కూడా సీబీఐ రెండోసారి కూడా మొదటి మాటకే కట్టుబడుంది. బెయిల్ రద్దు విషయమై కోర్టే నిర్ణయం తీసుకోవాలన్న పాత వాదనకే తాము కట్టుబడున్నట్లు సీబీఐ రెండోసారి కూడా స్పష్టంచేసింది.

కృష్ణంరాజు ఆరోపణలు చేస్తున్నట్లు సాక్ష్యులను జగన్ ప్రభావితం చేస్తున్నట్లు కానీ చేయటం లేదని కానీ ఎలాంటి వాదనా వినిపించలేదు. జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న ఎంపినే తన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. తన కేసుల్లోని సహనిందుతులకు ఉన్నత పదవులు ఇస్తున్నారని, రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఎంపి వాదన చెల్లటంలేదు.

తన ఆరోపణలు, వాదనల్లో పనలేదని ఎంపికి బాగా తెలుసు. అందుకనే కొత్తగా సీబీఐ, ఈడీలు జగన్ కేసులను సరిగా విచారణ చేయటంలేదంటు కొత్తగా మరో కేసు వేశారు. సరైన దారిలో దర్యాప్తు సంస్ధలు విచారణ చేసేట్లు ఆదేశాలివ్వాలని ఎంపి సీబీఐ, ఈడీలపై కేసు వేయటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే సాక్ష్యుల విషయంలో ఎలాగైనీ సీబీఐ తో అఫిడవిట్ దాఖలు చేయించాలని ఎంపి తెగ ప్రయత్నిస్తున్న విషయం అర్ధమైపోతోంది.

ఏదైనా న్యాయం కోసం పోరాటం చేస్తే ఫలితాలు అనుకున్నట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ పగ ప్రతీకారాల కోసం పోరాటం చేస్తే రిజల్టు ఊహించినట్లు రావడం అన్నది అంత సులువైన పనయితే కాదు. మరి ఈ వ్యవహారం ఎన్ని మలుపు తిరిగి ఎక్కడ ఆగుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.