Begin typing your search above and press return to search.

జోడో యాత్ర‌లో పాల్గొన్న ఐఏఎస్ అధికారిపై సీబీఐ కేసు.. సీరియ‌స్!!

By:  Tupaki Desk   |   14 Jan 2023 2:30 AM GMT
జోడో యాత్ర‌లో పాల్గొన్న ఐఏఎస్ అధికారిపై సీబీఐ కేసు.. సీరియ‌స్!!
X
ఆయ‌న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి. ఎప్పుడో త‌ప్పు చేశారు. చాలా ఏళ్లు గ‌డిచిపోయాయి. నిజానికి ఆ త‌ప్పు కూడా చాలా సీరియ‌స్‌గానే ఉంది. అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ కేసును చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ రించిన‌.. కేంద్ర ప్ర‌భుత్వం స‌ద‌రు ఐఏఎస్ అదికారి.. తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌.. ఎంపీ రాహుల్ గాంధీ నిర్వ‌హిస్తున్న భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్న‌రెండో రోజే.. పెద్ద ఎత్తున విరుచుకుప‌డింది. దేశ ద్రోహం(నిజానికి ఇప్పుడు లేదు.. అయినా న‌మోదుచేశారు), స‌హా.. వివిద క్రిమిన‌ల్ చ‌ట్టాల కింద కేసు పెట్టింది. దీంతో ఇది కాస్తా.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా వివాదం అయింది.

ఎవ‌రు?

1978 బ్యాచ్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన అరవింద్‌ మాయారాం ప్రస్తుతం రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశో క్‌ గహ్లోత్‌కు ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఈయ‌న‌కు కేంద్ర స‌ర్వీసుల్లో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి అశోక్‌తో క‌లిసి రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆ వెంట‌నే ఆయ‌న‌పై సీబీఐ కేసుల కొర‌డా ఝ‌ళిపించింది. దేశ ద్రోహం స‌హా.. ఇత‌ర కేసులు కూడా పెట్టింది. అంతేకాదు.. అరవింద్‌ నివాసాల్లో సోదాలు కూడా నిర్వ‌హించారు.

ఆయ‌న చేసిన నేర‌మేంటి?

ప్ర‌స్తుతం మ‌నం ఉప‌యోగించే క‌రెన్సీ నోట్ల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి చూస్తే.. మ‌ధ్య‌లో ఒక వెండి దారం ఒక‌టి క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం దీనిని వైట్ రంగులో ఉంచారు. కానీ, గ‌తంలో అంటే.. 2016 వ‌ర‌కు ఉన్న 500, 1000 రూపాయ‌ల నోట్ల‌లో ఆకుప‌చ్చ రంగులో ఉండేది. దీనిని ఆయా నోట్ల భ‌ద్ర‌త కోసం వినియోగించేవా రు. ఈ భ‌ద్ర‌తకు సంబంధించి వెండి దారాల‌ను(ఆకుప‌చ్చ‌ని రంగు) బ్రిట‌న్ నుంచి స‌ర‌ఫ‌రా చేసుకునేవాళ్లం.

బ్రిటన్‌కు చెందిన 'దె ల రూ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌` అనే సంస్థ ఈ దారాల‌ను సర‌ఫ‌రా చేసేది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ‌, ఆర్బీఐల అనుమ‌తి ఉండాలి. అయితే.. అప్ప‌ట్లో 2000 సంవ‌త్స‌రంలో ప్ర‌స్తు త మాజీ ఐఏఎస్ అర‌వింద్ కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లో ఈయ‌నే ఆ భ‌ద్ర‌తా దారానికి సంబంధించిన కాంట్రాక్టును బ్రిట‌న్ సంస్థ‌కు ఇచ్చారు.

అయితే.. బ్రిటన్‌ సంస్థకు లబ్ధి చేకూర్చేలా కాంట్రాక్టు పొడిగించడంలో అర‌వింద్ 2004-13 మ‌ధ్య‌ అవినీతికి పాల్ప‌డ్డార‌నేది ప్ర‌స్తుతం సీబీఐ ఆరోప‌ణ‌. ఈ వ్యవహారంలో కొంద‌రు గుర్తుతెలియని వ్యక్తులు కుట్రకు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. అనుమతుల్లేకుండా సరఫరా కాంట్రాక్టును పొడిగించారని ఆరోపించింది. భారతీయ శిక్షాస్మృతిలోని నేరపూరిత కుట్ర, మోసం, దేశ ద్రోహం సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసింది. ఇదీ.. సంగ‌తి!! జోడో యాత్ర ఎఫెక్ట్ ఇంత‌గా ఉంటుంద‌ని ఆయ‌న ఊహించి ఉండ‌ర‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.