Begin typing your search above and press return to search.
మాజీ హోం మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు..!
By: Tupaki Desk | 24 April 2021 9:30 AM GMTమహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయన నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇటీవలే అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖేశ్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ముఖేశ్ అంబానీపై బెదిరింపులకు దిగిన వారిలో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కూడా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మాజీ పోలీస్ అధికారి పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అనిల్ దేశ్‌ముఖ్ పెద్ద అవినీతి పరుడని పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు. ఆయన ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ విధించారని ఆరోపించారు. ఈ మేరకు నేరుగా సీఎం ఉద్దవ్ థాక్రేకు ఆయన లేఖ రాశారు. ఈ లేఖ వైరల్‌గా మారింది. అవినీతి ఆరోపణలతో అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజనామా చేశారు. ప్రస్తుతం ఆయనపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
తీగ లాగితే డొంక కదులుతున్నట్టుగా .. ముఖేశ్ అంబానీ బెదిరింపుల కేసు రోజుకో ట్విస్ట్ తీసుకుంటున్నది. ముంబై, నాగ్‌పూర్‌లోని అనిల్ దేశ్‌ముఖ్ ఇళ్లతో సహా నాలుగు చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.ముంబై మాజీ టాప్ పోలీసు అధికారి పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అవినీతి కేసు నమోదు చేయవచ్చో లేదో నిర్ణయించడానికి సీబీఐకి 15 రోజుల సమయం ఇచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అనిల్ దేశ్ ముఖ్, ఇంకా పలువురిపై ఏప్రిల్ 6 న ప్రాథమిక విచారణను పూర్తి చేసింది. అనిల్ దేశ్‌ముఖ్.. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాదే ఎన్నో అవినీతి పనులు చేసినట్టు విచారణలో వెల్లడైంది.