Begin typing your search above and press return to search.
వైఎస్ భారతికి నోటీసు లిచ్చి గాంధీ..అడ్డంగా బుక్కయ్యాడు
By: Tupaki Desk | 9 July 2019 2:44 PM GMTబొల్లినేని శ్రీనివాస గాంధీ... ఈ పేరు పెద్దగా పరిచయం లేనిదే గానీ... ఈడీ అధికారి గాందీ అనగానే... ఠక్కున గుర్తుకు వచ్చేస్తారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనపై దాఖలయ్యే ఫిర్యాదులను నీరుగార్చడం - అదే సయయంలో ప్రత్యర్థులపై నమోదయ్యే కేసుల్లో ఏమీ లేకున్నా గానీ... హడావిడి చేయించేసి కేసులు పెట్టించడం - వాటిని జెట్ స్పీడుతో పరుగులు పెట్టించడానికి వినియోగించే వ్యక్తే ఈ బొల్లినేని శ్రీనివాస గాంధీ. ఏడేళ్లకు పైగా ఆర్థిక నేరాలకు సంబందించిన దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరే్ (ఈడీ)లో ఏడేళ్లకు పైగా తనదైన శైలిలో చక్రం తిప్పేసి... నాడు విపక్ష నేత - ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును పరుగులు పెట్టించిన గాంధీ కూడా ఈయనే. సరే... చంద్రబాబు ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఈ గాంధీ ఇప్పుడు అడ్డంగా బుక్కైపోయాడు.
నేటి ఉదయం హైదరాబాద్ - విజయవాడలతో పాటు ఏకకాలంలో దేశవ్యాప్తంగా తనిఖీలు చేసిన సీబీఐ అధికారులు... గాందీని పట్టేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని గాంధీపై అభియోగాలు మోపుతూ కేసు కూడా నమోదు చేశారు. ఇటీవల సీబీఐలో పెను ప్రకంపనలు రేగిన నేపథ్యంలో సీబీఐలోని బాబు అనుంగులతో పాటు ఈడీలోని బాబు అనుకూలుడైన గాంధీని కూడా మోదీ సర్కారు అక్కడి నుంచి దాదాపుగా గెంటేసినంత పనిచేసింది. ఈడీ నుంచి గాంధీని బయటకు పంపిన మోదీ సర్కారు... ఆయనను జీఎస్టీ విభాగానికి బదిలీ చేసింది. జీఎస్టీ పన్ను ఎగవేత కేసులను చూసే విభాగంలో ప్రస్తుతం గాంధీ పనిచేస్తున్నారు.
రొటీన్ తనిఖీల్లో భాగంగానే సీబీఐ తనిఖీలు చేసినా... గాంధీ అడ్డంగా బుక్కైపోవడం గమనార్హం. సోదాల్లో రూ.3.75 కోట్ల మేర ఆదాయానికి మించిన ఆస్తులతు కలిగి ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థలో పనిచేసి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లుగా కేసు నమోదు చేయించుకున్న గాంధీకి సంబంధించి మరో ప్రత్యేక విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. అదేంటంటే... జగన్ పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి నడుస్తుంటే... అదేదో కొత్తగా ఇప్పుడే కనుక్కున్నట్లు జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయించిన ఘనత గాంధీది. ఈ క్రమంలో గాంధీపై జగన్ నేరుగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశారు. కోర్టులో చార్జీషీట్లు దాఖలైన ఐదారేళ్లకు కొత్తగా భారతి రెడ్డికి నోటీసులు జారీ కావడం వెనుక గాంధీ కక్షపూరిత వైఖరే కారణమని జగన్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తాజాగా అదే గాంధీ ఇప్పుడు సీబీఐకి అడ్డంగా బుక్కైపోవడం గమనార్హం.