Begin typing your search above and press return to search.
ఏపీ ఎమ్మెల్సీ ఇంట్లో సీబీఐ సోదాలు!
By: Tupaki Desk | 1 Aug 2019 4:35 AM GMTఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాసంలో కర్ణాటకకు చెందిన సీబీఐ అధికారులు పలువురు సోదాలు నిర్వహించటం కలకలం రేపింది. నెల్లూరు జిల్లాకు చెందిన వాకాటి ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయ్యగారి ముదురుతనం తెలిసిన వారంతా ముక్కున వేలేసుకున్న పరిస్థితి. 2014లో హైదరాబాద్ శివారులోని షామీర్ పేటలో రూ.12 కోట్ల విలువైన భవనానికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లను విలువ పెంచేసిన పెద్ద మనిషి ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ.190 కోట్ల రుణం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు.
అంత భారీ మొత్తానికి రుణం ఇచ్చే వేళలో.. తనఖా పెట్టిన ఆస్తులు సరైనవా? నకిలీవా? అన్న విషయాన్ని పట్టించుకోని అధికారులు తర్వాతి కాలంలో ఆయన పెట్టిన పత్రాలన్ని నకిలీవిగా గుర్తించి అవాక్కు అయ్యారు. ఈ విషయం కూడా ఎందుకు బయటకు వచ్చిందంటే.. రూ.190 కోట్ల భారీ రుణానికి సంబంధించి ఎలాంటి వడ్డీ కట్టకపోవటంతో బ్యాంకు అధికారులు మొద్దు నిద్ర లేచి.. ఎందుకిలా జరుగుతుందన్న విషయాన్ని కనుగునే ప్రయత్నంలో.. పత్రాల మీద అనుమానంతో తనిఖీ చేయించారు. అవన్నీ బోగస్ పత్రాలుగా తేలాయి.
దీంతో సదరు కార్పొరేషన్ ఇచ్చిన కంప్లైంట్ తో కేసును నమోదు చేశారు. అనంతరం 2017లో నెల్లూరుతో పాటు హైదరాబాద్.. బెంగళూరులోని ఆయన ఆఫీసుల్లో.. ఇళ్లల్లో నిర్వహించిన సోదాల్లో 99 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను గత ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉంటున్న ఆయన.. తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు దరఖాస్తు పెట్టుకున్నా.. కోర్టు నుంచి సానుకూల స్పందన రాలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా నెల్లూరులోని ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారులు మరోసారి తనికీలు నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో సీబీఐ అధికారులతో పాటు.. బ్యాంకు అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో జిల్లాలో వాకాటి ఎపిసోడ్ మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది.