Begin typing your search above and press return to search.
సుజనాకు కొత్త గవర్నమెంట్ ఫస్ట్ షాక్
By: Tupaki Desk | 1 Jun 2019 2:14 PM GMTకేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరికి మోడీ గవర్నమెంట్ మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే పలుమార్లు ఆయన కార్యాలయాలు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. తాజాగా మరోసారి సడెన్ గా ఆయన ఇల్లు, ఆఫీసుల్ల సోదాలు నిర్వహిస్తున్నారు.
కర్ణాటక నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని సుజనా చౌదరి కార్యాలయం, జూబ్లీహిల్స్ లోని కార్యాలయాల్లో శనివారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. నగరంలో మొత్తం మూడుచోట్ల ఏకకాలంలో ఈ ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. ఈసారి సోదాల్లో బ్రాంకింగ్ ప్రాడ్ సెల్ టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది.
ఆర్థిక అవకతవకల్లో ఆధారాల కోసం ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. నలుగురు సుజనా గ్రూప్ డైరెక‍్టర్లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి అదుపులో ఉన్నవారు... శ్రీనివాస కళ్యాణ్‌రావు, వెంకట రమణారెడ్డి, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ వర్మను అని సమాచారం.
’బెస్ట్ అండ్ కాంప్టన్’ పేరుతో తెలుగుదేశం నేత మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు కుమారుడితో కలిసి సుజనా వ్యాపాారాలు చేశారు. ఆ కంపెనీ పేరుతో అక్రమ పద్ధతుల్లో బ్యాంకుల రుణాలు తీసుకున్నట్లు ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. ఇప్పటికే ఓటమితో కుంగి ఉన్న తెలుగుదేశం నేతలకు ఇది పెద్ద షాక్. ఎలాగైనా మోడీని పదవీచ్యుతుడిని చేయడమే లక్ష్యంగా పనిచేసిన చంద్రబాబు బృందానికి సంపూర్ణ మెజారిటీతో ఉన్న మోడీ ప్రభుత్వం నుంచి ఇక వరుస షాకులు తప్పవు.