Begin typing your search above and press return to search.
వైసీపీ ఎంపీ అభ్యర్థి ఇల్లు.. ఆఫీసుల్లో సీబీఐ సోదాలు ఎందుకంటే?
By: Tupaki Desk | 1 May 2019 5:11 AM GMTపవర్ ప్రాజెక్టు కోసం భారీగా రుణం తీసుకొని తిరిగి చెల్లించని కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి కె.రఘురామ కృష్ణంరాజుకు చెందిన ఇల్లు.. ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. రఘురామకృష్ణంరాజు అండ్ కోలు తమిళనాడులోని ట్యూటికోరిన్ జిల్లా సత్తాంకుళం తాలుకాలో థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇందుకోసం పలు రుణ సంస్థల్ని సంప్రదించారు. తమ ప్రాజెక్టును వివరించి లోన్ కోసం అప్లై చేశారు. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు (యాక్సిస్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్.. సౌత్ ఇండియా బ్యాంక్.. ఎస్ బీఐ.. ఐవోబీ.. బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఆంధ్రా బ్యాంకు) మొత్తం రూ.2656 కోట్ల మొత్తాన్ని లోన్ గా ఇచ్చేందుకు ఓకే చెప్పాయి.
2011 ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అనుకున్న దానిలో తొలి విడతగా రూ.947.71 కోట్ల నిధులను విడుదల చేశాయి. వాటిని హైదరాబాద్ గ్రీన్ లాండ్స్ యాక్సిస్ బ్యాంక్ లో జమ చేశారు. మరికొంత మొత్తాన్ని సదరు సంస్థలన్ని కలిపి ట్రస్ట్ గా ఏర్పాటు చేసి అందులో ఉంచారు. నిధులు ఉన్నా ప్రాజెక్టు స్పీడప్ కాకపోవటం.. వివిధ రూపాల్లో బ్యాంకులోని మొత్తాన్ని మళ్లించటం మొదలెట్టారు. పవర్ ప్రాజెక్టు పేరుతో తమను మోసం చేసినట్లుగా రుణదాతలు కంప్లైంట్ చేశారు. వీరికి గ్రీన్ ల్యాండ్ యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది సహకరించినట్లుగా పేర్కొంటూ 2018లో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసును కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐకు బదిలీ చేశారు. తాజాగా ఇదే కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని రఘురామకృష్ణంరాజు ఇల్లు.. ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. బ్యాంకులకు రూ.600 కోట్ల అప్పు ఉన్న మాట వాస్తవమేనని.. తమ పవర్ సంస్థకు నష్టాలు రావటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. వన్ టైం సెటిల్ మెంట్ కోసం అప్లై చేసినట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఒకసారి వాంగ్మూలం తీసుకున్నారని.. తాజాగా మరోసారి వాంగ్మూలం తీసుకున్నట్లు చెప్పారు.