Begin typing your search above and press return to search.
లాలూకు ఇక సినిమాయేనా?
By: Tupaki Desk | 7 July 2017 7:15 AM GMTరాజకీయాల్లో శాశ్వత శతృత్వాలు, శాశ్వత మితృత్వాలు ఉండవన్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలతో ఇది మరోసారి నిరూపితమవుతోంది. మరీ ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను బీజేపీ టార్గెట్ చేయడం.. ఆయన కోసం మొన్నటి ఎన్నికల మిత్రుడు, సీఎం నితీశ్ కుమార్ మాట సాయం కూడా చేయకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో అక్కడి సీను దేశానికి బోధ పడుతోంది. లాలూకు బ్యాడ్ టైం మొదలైందని... అలాగే ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకించే నితీశ్ కుమార్ ఇప్పుడు మనసు మార్చుకుని మోడీకి దగ్గరవుతున్నారని అర్థమవుతోంది.
లాలూను మొన్నటివరకూ ఐటీ దాడులతో భయపెట్టిన ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సీబీఐనే ప్రయోగించింది. లాలూప్రసాద్ యాదవ్ నివాసంపై శుక్రవారం ఉదయం సీబీఐ దాడులు చేపట్టింది. ఢిల్లీ - పాట్నా - రాంచీ - పూరి - గుర్గావ్ సహా 12 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి - కుమారుడు తేజస్వియాదవ్ - ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజయం కార్పొరేషన్ మాజీ ఎండీపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
హోటళ్ల టెండర్ల వ్యవహారంలో సీబీఐ ఈ కేసులు నమోదు చేసింది…. 2006లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచి - పురి ప్రాంతాల్లో హోటళ్ల టెండర్ల విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఏజెన్సీ రిపోర్టులు నివేదించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేకు చెందిన రెండు హోటళ్లను ప్రైవేట్ హాస్పిటాలిటీ గ్రూప్‌కు ట్రాన్స్ ఫర్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హోటళ్లను ఎక్స్చేంజ్ చేయడం కోసం ఈ హాస్పిటాలిటీ గ్రూప్ పాట్నాలోని రెండు ఎకరాల విలువైన భూమిని లాలూ సంస్థలకు లంచంగా ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ దాడులు, కేసుల ప్రభావం బీహార్ లో మహాకూటమిపై పడే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే నితీష్ ఎన్డీయే వైపు అడుగులు వేస్తున్నారు. మోదీకి సన్నిహితంగా మారుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఆర్జేడీకి గుడ్ బై చెప్పి నితీష్ బీజేపీతో జతకట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తానికి త్వరలో బీహార్ రాజకీయాల్లో భారీ మార్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే టైంలో లాలూను బీజేపీ మరింత వెంటాడడం ఖాయమని.. ఆయనకు చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నారని టాక్.