Begin typing your search above and press return to search.

చందాకొచ్చ‌ర్ పై సీబీఐ కేసులు

By:  Tupaki Desk   |   25 Jan 2019 4:48 AM GMT
చందాకొచ్చ‌ర్ పై సీబీఐ కేసులు
X
అత్యున్న‌త స్థానానికి చేరుకోవ‌టం అంత ఈజీ కాదు. ఒక‌సారి ఆ స్థానానికి చేరుకున్న త‌ర్వాత త‌ప్పులు చేస్తే ఆ భ‌గ‌వంతుడు కూడా ర‌క్షించ‌లేడ‌న్న నానుడి చందాకొచ్చ‌ర్ ఇష్యూలో నిజ‌మేన‌నిపించ‌క మాన‌దు. దేశంలో ఇంత‌మంది ఉండి.. ఇన్ని బ్యాంకులు ఉన్న‌ప్ప‌టికీ సూప‌ర్ ఉమెన్ గా.. బ్యాంకింగ్ రంగంలో బ్రాండ్ అంబాసిడ‌ర్ గా.. మంచి పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకున్న చందాకొచ్చ‌ర్ మీద సీబీఐ తాజాగా కేసులు న‌మోదు చేసింది.

ఐసీఐసీఐ బ్యాంక్ కు అన్నీతానై న‌డిపిస్తున్న వేళ‌.. చందాకొచ్చ‌ర్ తీసుకున్న నిర్ణ‌యాలు వివాదాస్ప‌దంగా మార‌ట‌మే కాదు.. కేసులు పెట్టే అవ‌కాశాన్నిక‌ల్పించాయని చెప్పాలి. తాజాగా సీబీఐ న‌మోదు చేసిన కేసుల వ్య‌వ‌హారాన్నే చూస్తే.. చందాకొచ్చ‌ర్ భ‌ర్త దీప‌క్ కొచ్చ‌ర్ నిర్వ‌హిస్తున్న కంపెనీలో వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ లు పెట్టుబ‌డులు పెట్ట‌టం.. మ‌రోవైపు వీడియోకాన్ సంస్థ‌కు భారీగా రుణం ఇవ్వటం చూస్తే.. త‌న‌కున్న ప‌వ‌ర్ ను చందాకొచ్చ‌ర్ త‌ప్పు దారి ప‌ట్టించార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

దీప‌క్ కొచ్చ‌ర్ నిర్వ‌హిస్తున్న సూప‌వ‌ర్ రెన్యువ‌బుల్స్‌.. సుప్రీం ఎన‌ర్జీల‌తో పాటు వీడియోకాన్ కు చెందిన వీడియోకాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌.. వీడియోకాన్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ సంస్థ‌ల‌పైనా సీబీఐ కేసులు న‌మోదు చేసింది. వీడియోకాన్ గ్రూపు కార్యాల‌యాల్లో సీబీఐ సోదాలు నిర్వ‌హించింది.

వీడియోకాన్ కు ఐసీఐసీఐ బ్యాంకు ఇప్ప‌టివ‌ర‌కూ రూ.3250 కోట్ల‌ను రుణాలుగా మంజూరు చేసింది. అందులో రూ.1875 కోట్ల మేర ఆరు రుణాల్ని ఇప్ప‌టి బ్యాంకు క‌మిటీ స‌భ్యులు విడుద‌ల చేయ‌గా.. గ‌తంలో బ్యాంక్ కు అన్నీ తానై న‌డిపించిన చందాకొచ్చ‌ర్ హ‌యాంలో రూ.1050 కోట్ల రుణాన్ని రెండు ద‌ఫాలుగా విడుద‌ల చేశారు. అనంత‌రం వేణుగోపాల్ ధూత్ రూ.64 కోట్ల మొత్తాన్ని దీప‌క్ కొచ్చ‌ర్ కు చెందిన నూప‌వ‌ర్ కంపెనీలో పెట్ట‌టం గ‌మ‌నార్హం. రూ.64 కోట్ల పెట్టుబ‌డి కోసం అంతులేని అవ‌మానాన్ని మూట‌క‌ట్టుకోవాలా చందాకొచ్చ‌ర్?