Begin typing your search above and press return to search.
గుంటూరు సీసీఎస్ పోలీసులపై సీబీఐ కేసు నమోదు !
By: Tupaki Desk | 12 Aug 2020 10:50 AM GMTగుంటూరు అర్బన్ పోలీసుల పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఓ కేసుకు సంబంధించి అక్రమ నిర్బంధంపై కేసు ఫైల్ చేశారు. గుంటూరులో కొన్నిరోజుల క్రితం సంచలనం రేపిన క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హజరుపర్చ లేదు. వారిని విచారణ పేరిట తీసుకు వెళ్లి కోర్టులో హాజరు పరచక పోవడంతో ఆ ముగ్గురు వ్యక్తుల భార్యలు హైకోర్టు లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ భర్తలను తీసుకువెళ్ళిన అర్బన్ పోలీసులు వారిని ఎక్కడ ఉంచారో తెలియదని పొందుపరిచారు.
దీంతో అర్బన్ పోలీసులపై జూడిషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. జూడిషియల్ విచారణలో పోలీసులు తమను ఇబ్బంది పెట్టారని ఆ ముగ్గురు వ్యక్తులు చెప్పడంతో అర్బన్ పోలీసులపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. అర్బన్ ఎస్పీ రామకృష్ణ సమయంలోనే ఆయన మీద సిబిఐ విచారణ చేపట్టింది.
ముగ్గుర్ని నిర్బంధంచడం.. పట్టాభిపురం స్టేషన్ వద్ద మహిళల పట్ల సీఐ కళ్యాణ రాజు అమానుషంగా వ్యవహరించాడని లాయర్ కోర్టుకు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఎస్పీ రామకృష్ణపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన కారకుడు సీఐ కళ్యాణ రాజుపై కూడా కేసు నమోదు చేయాలని న్యాయవాది మాగులూరి హరిబాబు డిమాండ్ చేశారు. సీబీఐ రంగంలోకి దిగడం కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది.