Begin typing your search above and press return to search.

జడ్జిలపై దూషణల కేసులో ట్విస్ట్

By:  Tupaki Desk   |   14 Dec 2020 4:13 PM GMT
జడ్జిలపై దూషణల కేసులో ట్విస్ట్
X
ఏపీ హైకోర్టు జడ్జిలపై సోషల్ మీడియాలో, బయటా ఆ మధ్య సాగిన దూషణల పర్వం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదైంది. అవి మందకొడిగా సాగాయి. దీంతో ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యి కేసును సీబీఐకి అప్పగించింది.

అయితే సీబీఐ కూడా జడ్జిలపై దూషణల కేసులో పెద్దగా దర్యాప్తు చేయడం లేదని తెలిసింది. సీఐడీ నమోదు చేసుకున్న కేసులను మాత్రమే స్వాధీనం చేసుకున్న సీబీఐ.. విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని.. కనీసం నాలుగు నెలలు పడుతుందని తాజాగా కోర్టుకు తెలిపింది.

సీబీఐకి ఇచ్చిన గడువు తాజాగా పూర్తయ్యింది. దీనిపై హైకోర్టులో విచారణ జరగగా.. సీబీఐ నివేదికను హైకోర్టులో సమర్పించింది.

జడ్జీలను దూషించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. నిందితులు వివిధ దేశాల్లో ఉన్నందున వారిని విచారించేందుకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలిపింది. అంతవరకు సమయం ఇవ్వాలని సీబీఐ న్యాయవాది కోరారు.

దీంతో న్యాయమూర్తి సీబీఐకి గడువు ఇస్తూ విచారణను ఏకంగా వచ్చే ఏడాది మార్చి 31కి వాయిదా వేశారు.

ఏపీ హైకోర్టు జడ్జీలను బెదిరిస్తూ ఓ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కావాలనే పెట్టారని దీని వెనుకు కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణలో ఫేక్ అకౌంట్ల నుంచి ఇవన్నీ చేశారని తేలినట్టు సమాచారం.