Begin typing your search above and press return to search.
ఢిల్లీ మద్యం స్కాం : తెలుగు రాష్ట్రాల్లో లింకులు...?
By: Tupaki Desk | 20 Aug 2022 11:39 AM GMTఎక్కడో టచ్ చేస్తే మరెక్కడో సౌండ్ వస్తోంది. ఇపుడు దేశమంతా చర్చగా ఆప్ ఎక్సైజ్ మంత్రి డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియా ఇంటి మీద సీబీఐ దాడులు చేపట్టిన విషయం ఉంది. అలాగే ఇది రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టిస్తోంది. మోడీ ఆప్ ల మధ్యనే వచ్చే ఎన్నికల్లో పోటీ అనే దాకా వ్యవహారం వెళ్ళింది. ఇదిలా ఉండగా తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమ ఎక్సైజ్ పాలసీ కరెక్ట్ అని మనీష్ సిసోడియా చెబుతున్నారు.
అయితే గత నవంబర్‌లో ఢిల్లీని ఏలే ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని అలాగే, నిబంధనల ఉల్లంఘన జరిగాయన్న ఆరోపణల ఆధారంగా సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన సూచనలతోనే సీబీఐ కేసు దర్యాప్తు ప్రారంభించింది. మనీష్ సిసోడియా నివాసంతో సహా 31 చోట్ల సిబిఐ దాడులు నిర్వహించగా అక్కడ కొన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. అలాగె సిసోడియాపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది.
సరే ఈ దర్యాప్తు సాగుతోంది కదా ఎక్కడో ఢిల్లీ కదా అనుకుంటే పొరపాటే. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాం మీద దర్యాప్తు చేస్తూంటే అందులో తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున లింకులు ఉన్నాయని బయటపడుతోందిట. ఇపుడు ఇది అతి పెద్ద రాజకీయ సంచలనంగా మారుతోంది. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మద్యం వ్యాపారులకు ఈ స్కాం తో లింకులు ఉన్నాయని అంటున్నారు.
ఇక దీనికి మూలాల అన్వేషణలో సీబీఐ అధికారులు పడ్డారని తెలుస్తోంది. హైదరాబాద్ లో మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై ఇంటిపై సీబీఐ దాడులు తాజాగా చేశారు. ఈ పిళ్లై అన్న ఆయనకు ఇండో స్పిరిట్ గ్రూప్ ఎండీతో సంబంధాలున్నాయని సీబీఐ ఆరోపిస్తోంది. దాంతో సీబీఐ ఇటు వైపుగా కూడా దర్యాప్తు చేస్తోంది. ఇక పిళ్ళే హైదరాబాద్ కి చెందినవారు అయినా ఆయన బెంగళూరు లో నివాసం ఉంటున్నారు.
ఇక పిళ్లై ఇంటి మీద సీబీఐ దాడులు జరిగిన నేపధ్యంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి చెందిన బ్రూవరీల ప్రమేయంతో ఉందని కూడా ప్రచారం సాగడం విశేషం. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విషయం అయితే ఇపుడు దక్షిణాదిలోని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. అంతే కాదు గతంలో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేసిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్రా క్యాడర్ ఐఏఎస్ అధికారి గోపీకృష్ణ నివాసానికి కూడా సీబీఐ అధికారులు చేరుకున్నారని చెబుతున్నారు.
ఆయన హయాంలోనే మద్యం షాపుల కేటాయింపులు జరిగాయి అన్న దానితో ఇపుడు సీబీఐ ఆ వైపు నుంచి కూపీ లాగుతోంది అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గతంలోనే ఓ కేంద్ర మంత్రి తెలుగు రాష్ట్రాలకు ఎంపీ పేరు చెప్పి మధ్యం స్కాం మీద ఆరోపణలు గుప్పించినట్లుగా అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇపుడు జరుగుతున్నది చూసినా ఆ ఆరోపణల వెనక పెద్ద కధే ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మొత్తానికి అటు నుంచి ఇటు తిరగేస్తే చాలా జాతకాలు ఇక్కడ బయటపడతాయని అర్ధమవుతోంది. అలాగే ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం లింకుల మీద తెలుగు రాష్ట్రాలలో సీబీఐ చేస్తున్న సోదాలు ఏ రకమైన సమాచారాన్ని అందిస్తాయో అన్న టెన్షన్ అయితే అంతటా ఉంది మరి.