Begin typing your search above and press return to search.
‘జగన్ గేమ్ ప్లాన్’ అంటూ సీబీఐ షాకింగ్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 7 Dec 2021 3:23 AM GMTఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్ని ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణకు ఆయన హాజరు కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీబీఐ చేసిన వాదనలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
కేసుల విచారణకు సీబీఐ కోర్టుకు హాజరు కాకుండా ఆయనకు వ్యక్తిగత మినహాయింపులు ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ కోరింది. కేసుల విచారణను ఆలస్యం చేయటానికి జగన్ ఆడుతున్న గేమ్ ప్లాన్ గా అభివర్ణిస్తూ.. అందులో భాగంగానే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నట్లు వెల్లడించింది.
తాజాగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా.. సీబీఐ న్యాయవాది సురేందర్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీబీఐ తరఫున కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు విచారణను ఆలస్యం చేయటానికే ఇలా చేస్తున్నారని.. ఇదంతా గేమ్ ప్లాన్ అని పేర్కొన్నారు.
‘సీబీఐ కేసులు నమోదై పదేళ్లు అవుతోంది. ఇంకా డిశ్చార్జి పిటిషన్ల దశ కూడా దాటలేదు. నిందితులు ఉద్దేశపూర్వకంగా ఒకరి తర్వాత మరొకరు పిటిషన్లువేస్తున్నారు. అభియోగాల నమోదు అయ్యాక హాజరు నుంచి మినహాయింపు తీసుకోవటం వేరు. దాని కంటే ముందే మినహాయింపు ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదు.
వ్యక్తిగత మినహాయింపుపై గతంలో పిటిషనర్ దాఖలు చేసిన పిటిణ్లు దిగువ కోర్టు.. ఇదే హైకోర్టు కొట్టివేశాయి. ప్రస్తుతం పిటిషనర్ పెద్ద హోదాలో ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది సాక్ష్యుల్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది’’ అని పేర్కొన్నారు.
ఒక సారి అభియోగాలు నమోదైతే.. ఏడాది లోపు ట్రయల్ పూర్తి కావాల్సి ఉంటుందన్న న్యాయవాది.. కేసులు నమోదైన పదేళ్లు అవుతోందని.. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందన్నారు. ఇదిలా ఉంటే.. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. సీబీఐ కోర్టులో కానీ.. హైకోర్టులో కానీ తాము ఎప్పుడూ వాయిదాలు తీసుకోలేదని.. ఆలస్యానికి తాము కారణం కాదన్నారు.
అప్పట్లో పిటిషనర్ ఎంపీగా ఉండేవారని.. హైదరాబాద్ లో ఉండేవారన్నారు. ఇప్పుడు పిటిషనర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారని.. అక్కడే నివాసం ఉంటున్నారన్నారు.
‘గతంలో క్విడ్ ప్రోకో కేసులపై సీబీఐ కోర్టులో విచారణ వారంలో ఒకసారి విచారణ జరిగేది. ఇప్పుడు వారంలో ఐదు రోజులు జరుగుతోంది. ఒక సీఎం వారంలో ఐదు రోజులు కోర్టుకు హాజరు కాలేరు. పాలనా వ్యవహారాలు గాడి తప్పుతాయి. అభియోగాలకు ముందు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదని ఎక్కడా లేదు.
ఈ అంశం కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. సీబీఐ వాదనల నేపథ్యంలో ఎలాంటి తీర్పును వెలువరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.