Begin typing your search above and press return to search.

సోనియా అల్లుడిని భయపెడుతున్న సీబీ'ఐ'!

By:  Tupaki Desk   |   2 July 2020 5:30 PM GMT
సోనియా అల్లుడిని భయపెడుతున్న సీబీఐ!
X
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబార్ట్ వాద్రాకు బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారికి సీబీఐ షాకిచ్చింది. ఓఎన్జీసీ ముడుపుల వ్యవహారంలో ఆయనతోపాటు సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ ఇంజినీరింగ్ కంపెనీకి, ఓఎన్జీసీ అధికారులపై బుధవారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

2009లో నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గుజరాత్ లో ఓఎన్జీసీ ప్రాజెక్టు దహేజ్ ను ప్రారంభించారు. ఓఎన్జీసీ ఓ విదేశీ కన్సార్టియంతో రూ.6744 కోట్ల ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందం వెనుక ముడుపుల వ్యవహారం నడిచినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. అందులో సోనియా అల్లుడు రాబార్ట్ వాద్రా , ఆయన అనుయాయులకు లంచాలు అందాయని ఈడీ ఆరోపిస్తోంది. ఆ సొమ్ముతో లండన్ లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కొన్నారని బీజేపీ ఆరోపణల మేరకు సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.

తాజాగా ఈ ముడుపుల వ్యవహారంలో ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి, శాంసంగ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ పాత్ర కూడా ఉన్న నిర్ధారణ కావడంతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో సోనియా అల్లుడుకి కూడా త్వరలోనే బుక్ చేస్తారనే ఊహాగానాలు ఢిల్లీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.