Begin typing your search above and press return to search.

వివేకా హత్య : విచారణ ప్రారంభించిన సీబీఐ !

By:  Tupaki Desk   |   18 July 2020 11:10 AM GMT
వివేకా హత్య : విచారణ ప్రారంభించిన సీబీఐ !
X
ఆంధ్రప్రదేశ్ లో సంచలన సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంబించింది. కొన్ని రోజుల ముందు ఏపీ హైకోర్టు ఈ కేసుని సీబీఐ కి అప్పగించాలని ఆదేశాలు జారీచేయగా ..తాజాగా కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ రోజు కడపలో ఎస్పీ కార్యాలయనికి వెళ్లి , కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్, ఇతర అధికారులతో సమావేశమై, ఆ హత్యకి సంబంధించిన విషయాలని అడిగి తెలుసుకున్నారు. 2019 మార్చి 15న వివేకా దారుణ హత్య కి గురైయ్యారు. ఆ తరువాత ఇంతవరకు జరిగిన అన్ని విషయాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత పులివెందులకి వెళ్లి క్షేత్ర స్థాయిలో విచారణ ప్రారంభించనున్నారు.

ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తకరంగా సాగుతున్న తరుణంలో 2019 మార్చి 15న పులివెందుల శివార్లలోని తన సొంత ఇంటిలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మొదట వైఎస్ కుటుంబ సభ్యులు ఆయన గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. ఆ తర్వాత బాత్ రూమ్ లో కాలుజారి పడ్డారని చెప్పారు. చివరికి వివేకా మృతదేహంపై గాయాలు, మృతదేహాన్ని బెడ్ రూమ్ లోకి తీసుకొచ్చి రక్తపు మరకలు తుడిచేసారు. దీనితో ఈ హత్య ఫై అందరిలో అనుమానాలు మొదలైయ్యాయి. ఆ సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ హత్య పై సిట్ ఏర్పాటు చేసింది. కానీ జగన్ కుటుంబం సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. అయితే సిట్ , ఏపీ పోలీసులు ఇప్పటికే ఈ కేసులో మూడు సార్లు విచారణ చేసినప్పటికీ కూడా హంతకులు ఎవరో కనిపెట్టలేకపోయారు. దీనితో వివేకా కూతురు .. సునీత తన తండ్రి హత్య కేసుని సీబీఐ కి అప్పగించాలని హైకోర్టు ను ఆశ్రయించింది.

దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసును సీబీకి అప్పగిస్తూ 4 నెలల ముందే సంచలన తీర్పు వెల్లడించింది. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా కూడా హంతుకులు ఎవరో కనిపెట్టలేకపోయారని, కేసుపై విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. అలాగే వీలైనంత త్వరగా ఈ కేసు విచారణను పూర్తిచేసి , తుది నివేదికను దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు సూచించింది. కోర్టు ఆదేశాలతో తాజాగా రంగంలోకి దిగిన సీబీఐ ..విచారణను షురూ చేసింది. చూడాలి మరి ఈ కేసులో సీబీఐ ఎలాంటి విషయాలు బయటపెడుతుందో ..