Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ను వదలిపెట్టని బీజేపీ..టీఆర్ఎస్ మంత్రి, ఎంపీకి సీబీఐ నోటీసులు

By:  Tupaki Desk   |   30 Nov 2022 12:30 PM GMT
టీఆర్ఎస్ ను వదలిపెట్టని బీజేపీ..టీఆర్ఎస్ మంత్రి, ఎంపీకి సీబీఐ నోటీసులు
X
తెలంగాణలోకి సీబీఐను నిషేధించేశాడు సీఎం కేసీఆర్. దీంతో సీబీఐ అధికారులు తెలంగాణలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతానికి ఈ సీబీఐ కేసులను నోటీసుల ద్వారా అందిస్తూ ఢిల్లీకే పిలిపిస్తోంది. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దండయాత్ర చేస్తున్న కేంద్రంలోని బీజేపీ దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తోంది. ఇప్పటికే ఐటీ, ఈడీ దాడులు సాగుతున్న వేళ ఇప్పుడు సీబీఐ కూడా ఎంట్రీ ఇచ్చింది.

టీఆర్ఎస్ నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కు సంబంధించిన కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు జారీచేసింది. రేపు ఢిల్లీలో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించింది.

ఇక అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్.. మంత్రి కమలాకర్ తో టచ్ లో ఉన్నట్టు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. తనకు ఉన్న పరిచయాల ద్వారా గ్రానైట్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఉపశమనం వచ్చేలా శ్రీనివాస్ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే కరీంనగర్ లోని మంత్రి గంగుల ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినట్టు తెలిసింది. శ్రీనివాస్ తో సంబంధాలు, ఎవరెవరితో మాట్లాడారనే అంశాలపై గంగుల , వద్దిరాజు రవిచంద్ర వాంగ్మూలం నమోదు చేసేందుకు నోటీసులు ఇచ్చినట్టు సీబీఐ తెలిపింది.

గంగుల కమాలకర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్ కు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కొద్దిరోజుల క్రితం ఈ అధికారులు ఆయన ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పుడు సీబీఐ దాడుదలకు దిగడం సంచలనమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.