Begin typing your search above and press return to search.
ఐఎంఏ స్కాంలో మాజీ మంత్రులు - ఐఏఎస్ లు!
By: Tupaki Desk | 3 Sep 2019 8:24 AM GMTఐఎంఏ జ్యువెల్లర్స్ స్కాం.. కర్ణాటక కేంద్రంగా జరిగిన అతిపెద్ద మోసం. ఇందులో జనాల వద్ద కోట్ల డబ్బులు వసూలు చేసి ఆ కంపెనీ బిచాణా ఎత్తివేసింది. అయితే వేల కోట్లు కొట్టేసిన వీరు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కర్ణాటక మంత్రులు - ఐఏఎస్ లు - ఇతర అధికారులకు భారీగా లంచాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఐఎంఏ జ్యువెల్లర్స్ యజమాని మన్సూర్ ఆలీఖాన్ గతంలో వెల్లడించి సంచలనం సృష్టించారు.
వేల కోట్ల ఐఎంఏ స్కాం కావడం.. దేశవ్యాప్తంగా బాధితులు ఉండడంతో ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఐఎంఏ స్కాం కేసు దర్యాప్తునకు సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 30మంది నిందితుల మీద ఎఫ్ ఐఆర్ నమోదు చేయడం వివేషం.
కాగా ఇందులో ప్రధాన నిందితుడిగా ఐఎంఏ జ్యువెల్లర్స్ యజమాని మన్సూర్ అలీఖాన్ - అతడి ప్రధాన అనుచరులు నిజాముద్దీన్ - నవీద్ - ఐఏఎం డైరెక్టర్ వాసీం - అర్హద్ ఖాన్ - అప్సర్ బాషా - అసాదుల్లా - శరాద్ - ఇస్సార్ - పుసేల్ - ఇద్రీష్ - అబ్రేస్ - మొజాహిద్ లపై ప్రధాన అభియోగాలను సీబీఐ మోపింది.
ఇక బెంగళూరు కలెక్టర్ గా పనిచేసి విజయ్ శంకర్ - అసిస్టెంట్ కలెక్టర్ ఎస్సీ నాగరాజు - బీడీఏ పీడీ - గ్రామ లెక్కాధికారి తదితర ప్రభుత్వ అధికారుల మీద కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కన్నడనాట దుమారం రేపింది.
మన్సూల్ అలీఖాన్ ను ఈ ఐఎంఏ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన అధికారులు అడి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కేసులో ఉన్న మాజీ మంత్రులు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జమీర్ - రోషన్ బేగ్ లను విచారించారు. వీరిని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.