Begin typing your search above and press return to search.
మాల్యా నిర్దోషి అని చెప్పే నాలుగు పెట్టెల సాక్ష్యాలు!
By: Tupaki Desk | 5 Dec 2017 4:11 AM GMTఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.9వేల కోట్ల రూపాయిలు బ్యాంకులకు ఎగ్గొట్టి.. గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తాను సుద్దపూసనని.. నిర్దోషినని వాదిస్తున్నారు. ఆర్థిక నేరం చేసి దేశం నుంచి పారిపోయిన మాల్యాను వెనక్కి తెచ్చేందుకు మోడీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు అన్నిఇన్ని కావు.
మోడీ సర్కారు తీరుకు ధీటుగా రియాక్ట్ అవుతున్నారు మాల్యా. తాను నిర్దోషినని.. ఎలాంటి తప్పులు చేయలేదంటూ కోర్టుకు రావటమే కాదు.. తనతో పాటు నాలుగు పెట్టెల్ని తీసుకొచ్చారు.
తాను నిర్దోషినని చెప్పే పత్రాలను నాలుగు పెట్టెల్లో తీసుకొచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని.. తానునిర్దోషినని చెప్పారు. తానేమిటన్నది కోర్టే నిర్ణయిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. మాల్యా కేసు విచారణ కోర్టుకు వచ్చిన వేళ.. కోర్టులో బాంబును అమర్చారంటూ సమాచారం వచ్చింది.
దీంతో.. అప్పటికప్పుడు కోర్టు గదిని ఖాళీ చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు కోర్టు గదిని తనిఖీ చేశారు. బాంబు బెదిరింపు ఉత్తదేనని తేల్చారు. అనంతరం మాల్యా కేసు విచారణను జరిపారు. సోమవారం మొదలైన కోర్టు విచారణ ఈ నెల 14 వరకు కొనసాగనుంది. అనంతరం తీర్పు వెలువడనుది. తాను నిర్దోషినని చెప్పే నాలుగు పెద్ద పెద్ద పెట్టెల్లో ఆధారాల పేరుతో పత్రాల్ని తీసుకొచ్చారు. కోర్టు విచారణలో భారత్ తరపు వాదనలు వినిపించటానికి వీలుగా సీబీఐ.. ఈడీ బృందం కోర్టు వద్దకు చేరుకుంది. మరి.. మాల్యా తెచ్చిన నాలుగు పెట్టెల సాక్ష్యాలపై లండన్ కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.