Begin typing your search above and press return to search.
ప్రముఖ నటి హత్యపై ఇక సీబీఐ విచారణ?
By: Tupaki Desk | 12 Sep 2022 9:41 AM GMTప్రముఖ టిక్ టాక్ స్టార్, బిగ్ బాస్ బ్యూటీ.. బీజేపీ నాయకురాలు అయిన సోనాలి ఫోగట్ మృతి కేసులో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఆమె మొదట గుండెపోటుతో చనిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. పోస్టుమార్టం అనంతరం ఇది హత్యగా తేల్చారు. సోనాలి ఫోగట్ సన్నిహితులు ఆమెకు విష పదార్థాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె విషకరమైన పదార్థాలను తీసుకోవడం ద్వారా చనిపోయినట్లుగా గోవా పోలీసులు తెలిపారు. ఆమెతో బలవంతంగా కెమికల్స్ ను తాగించిన తర్వాత ఆమె సృహ కోల్పోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు.
ఈ కేసు విచారణ బాధ్యతలను తాజాగా సీబీఐకి అప్పగించాలని గోవా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోనాలి ఫోగట్ మృతి మొదట సాధారణ మరణమని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఆమె కూతురి విన్నపం మేరకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా గోవా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
గోవా పోలీసులపై మాకు పూర్తి విశ్వాసం ఉందని.. అయితే ప్రజల నుంచి ఒత్తిడి, మృతురాలి కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించామని ప్రమోద్ సావంత్ తెలిపారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్రహోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
సోనాలి ఫోగట్ ది హర్యానా. కుటుంబ సభ్యుల కోరిక మేరకు హర్యానా సీఎం ఖట్టర్ కూడా సీబీఐ విచారణ చేపడుతామని హామీ ఇచ్చారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశాడు. సోనాలి కుటుంబ సభ్యులకు గోవా పోలీసుల విచారణపై అసంతృప్తి ఉంటే సీబీఐ విచారణ చేస్తామన్నారు. చివరకు అదే జరిగింది. కేంద్రం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
గోవా టూర్ కు వెళ్లిన సోనాలి ఫోగట్ గత నెల 23వ తేదీన హోటల్ గదిలో ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తొలుత సోనాలి ఫోగట్ గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు పోలీసులు, వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అందరూ ఆమె గుండెపోటుతో మరణించారని భావించారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు సోనాలిది గుండెపోటు కాదని.. హత్య అంటూ గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా ఆమెది హత్య అని తేలింది. సోనాలి ఫోగట్ కు బలవంతంగా కెమికల్స్ తాగించారని పోలీసులు తెలిపారు. ఆమె శరీరంపై గాయాలు ఉండడంతో కొట్టినట్టుగా కూడా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.