Begin typing your search above and press return to search.

న్యూయార్క్ టైమ్స్‌ కు సీబీఐ ఘాటు రిటార్ట్‌

By:  Tupaki Desk   |   17 Jun 2017 7:04 AM GMT
న్యూయార్క్ టైమ్స్‌ కు సీబీఐ ఘాటు రిటార్ట్‌
X
ఈ మ‌ధ్య‌న సీబీఐ మ‌హా చైత‌న్య‌వంతంగా మారింది. ఎప్పుడు ఎవ‌రికి మీద సోదాలు నిర్వ‌హిస్తారో అర్థం కాని ప‌రిస్థితి. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం మొద‌లు ఎవ‌రైనా.. ఎక్క‌డైనా స‌రే.. అన్న‌ట్లుగా సీబీఐ తీరు మారింది. సీబీఐ దూసుకెళుతున్న తీరుకు ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో దేశంలోని ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో మీడియా సైతం ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఈ మ‌ధ్య‌న ప్ర‌ముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీపై సీబీఐ సోదాలు నిర్వ‌హించ‌టం సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై అమెరికాకు చెందిన ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ న్యూయార్క్ టైమ్స్ ఒక సంపాద‌కీయాన్ని ప్ర‌చురించింది. మీడియా స్వేచ్ఛ‌పై స‌ద‌రు ప‌త్రిక రాసిన సంపాద‌కీయంపై సీబీఐ తాజాగా సీరియ‌స్ అయ్యింది. స‌ద‌రు క‌థ‌నం ఏక‌ప‌క్షంగా ఉంద‌ని పేర్కొంది.

ఇండియాస్ బ్యాల‌ర్డ్ ప్రెస్ పేరిట స‌ద‌రు ప‌త్రిక జూన్ 7న సంపాద‌కీయాన్ని ప్ర‌చురించింది. భార‌త్ లోని ప్ర‌భుత్వ రంగ బ్యాంకు నెత్తిన 186 బిలియ‌న్ డాల‌ర్ల మేర వ‌సూలు కాని రుణాలుఉన్నాయ‌ని.. అయిన‌ప్ప‌టికీ మోడీ స‌ర్కారు బ‌డా ఎగ‌వేత‌దారుల మీద చ‌ర్య‌ల‌కు సంశ‌యిస్తోంద‌ని విమ‌ర్శించింది.

ఏన్నో ఏళ్ల రుణాన్ని బ్యాంకుతో స‌ర్దుబాటు చేసుకున్నా.. ఎన్డీటీవీపై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌టంపై న్యూయార్క్ త‌ప్పు ప‌ట్టింది. ఈ మీడియా సంపాద‌కీయాన్ని సీబీఐ త‌ప్పు ప‌ట్టింది. స‌ద‌రు సంపాద‌కీయాన్ని ఖండిస్తూ న్యూయార్క్ టైమ్స్ సంపాద‌కుల‌కు సీబీఐ లేఖ రాసింది. బ‌డా రుణ ఎగ‌వేత‌దారుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న రీతిలో సంపాద‌కీయాన్ని రాయ‌టాన్ని త‌ప్పు ప‌డుతూ విమ‌ర్శించారు. మ‌రి.. దీనిపై న్యూయార్క్ టైమ్స్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/