Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోసం సీబీఐ 3 నెలలు వెయిట్ చేసిందా?

By:  Tupaki Desk   |   24 Oct 2015 5:59 AM GMT
కేసీఆర్ కోసం సీబీఐ 3 నెలలు వెయిట్ చేసిందా?
X
అప్పుడెప్పుడో కేంద్ర కార్మికమంత్రిగా వ్యవహరించిన సమయంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కేసీఆర్ ను సీబీఐ అధికారులు పలు ప్రశ్నలు అడిగిన సంగతి తెలిసిందే. సీబీఐ అధికారులు సీఎంవోకి వచ్చి సీఎంను కొన్ని ప్రశ్నలు అడిగిన సంగతి కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే.. ఈ అంశంపై తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి కొత్త విషయాల్ని బయటపెట్టారు.

సీబీఐ ప్రశ్నలు ఎదుర్కొన్న కేసీఆర్.. అధికారులు ఏం అ డిగితే.. ఆయనేం సమాధానం చెప్పారో బయటకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిగా కేసీఆర్ వ్యవహరించినప్పుడు ఈఎస్ ఐ ఆసుపత్రుల భవన నిర్మాణానికి సంబంధం లేని ఏపీ మత్స్యశాఖకు అప్పగించటం వెనుక అవినీతి ఉందంటూ ఆరోపించారు.

అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లిన వెలుగుబంటి సూర్యనారాయణ నేతృత్వం వహిస్తున్న మత్య్సశాఖకు కాంటాక్ట్ ఇవ్వటంపై రేవంత్ పలు విమర్శలు చేశారు. ఆరోపణలు చేశారు. వెలుగుబంటి సూర్యనారాయణను ఇప్పటి తెలంగాణ మంత్రి హరీశ్ తీసుకెళ్లి కేసీఆర్ కు పరిచయం చేశారన్నారు. హరీశ్.. వెలుగుబంటి కుమ్మక్కై ఆసుపత్రి భవన నిర్మాణ కాంటాక్ట్ ను బదిలీ చేయించినట్లుగా చెప్పారు.

తన కొడుకు.. కూతురు అవినీతి చేసినా జైలుకు పంపుతానని చెప్పిన కేసీఆర్.. తాజాగా తనపై వచ్చిన ఆవినీతి ఆరోపణలకు సమాధానం ఇవాలని డిమాండ్ చేశారు. ఇక.. కేసీఆర్ ను ప్రశ్నలు వేసేందుకు సీబీఐ అధికారులు దాదాపు మూడు నెలల వరకూ వెయిట్ చేశారని.. తాజాగా టైం ఇవ్వటంతో వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతి విషయాన్ని వెల్లడించాల్సిన సీఎంవో.. సీబీఐ వచ్చి ప్రశ్నలు వేసిన వైనాన్ని ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చిన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణను సిద్ధం కావాలన్నారు. సీబీఐ అధికారులు అలా వచ్చి ఇలా ప్రశ్నలు వేసి వెళ్లిపోయారన్నట్లుగా చెప్పిన దాని వెనుక మూడు నెలల ప్రయత్నం ఉండన్న మాట.