Begin typing your search above and press return to search.
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు !
By: Tupaki Desk | 14 April 2021 11:45 AM GMTకేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ ఈ) 10వ తరగతి , అలాగే 12వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నది. కరోనా కారణంగా..సీబీఎస్ ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు కేంద్రం ప్రకటించింది. అలాగే 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అయితే, 12 వ తేదీ పరీక్షకు సంబంధించిన తుది నిర్ణయం జూన్ 1 న తీసుకోనున్నారు. కానీ పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నామని, మళ్లీ పరీక్షలు ఎప్పుడుంటాయన్న నిర్ణయం మాత్రం పరిస్థితులను బట్టి ఉంటుందని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో కరోనా మహమ్మారి జోరు భారీగా పెరుగుతుండటం తో సీబీఎస్ ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా వ్యాప్తి వల్ల ఎగ్జామ్స్ రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోడీని కోరగా కేజ్రీవాల్ నిర్ణయాన్ని సమర్థిస్తూ..ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం తరువాత 12 వ తరగతి పరీక్షలను వాయిదా వేసి 10 వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఢీల్లీతో పాటు చాలా రాష్ట్రాలు ఈమేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని విన్నపం చేశాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ ఈ 10వ తరగతి విద్యార్థుల కోసం, బోర్డు అభివృద్ధి చేసిన "objective criterion" ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ప్రాతిపదికన విద్యార్ధులకు కేటాయించిన మార్కులతో సంతృప్తి చెందని అభ్యర్థికి పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్షలో కూర్చునే అవకాశం ఇస్తారు. గతేడాది కూడా ప్రభుత్వం కొత్త పద్దతిని అనుసరించింది. షెడ్యూల్ ప్రకారం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 7 వరకు జరగాల్సి ఉండగా, 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 15 వరకు జరగాల్సి ఉంది.