Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో సోదాలు
By: Tupaki Desk | 15 Sep 2020 11:50 AM GMTకర్ణాటకలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో తవ్వినకొద్దీ విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వారిని విచారిస్తున్న పోలీసులు తాజాగా మంగళవారం నగరంలోని మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా బంగ్లాపై దాడి చేశారు.
ఈ కేసులో నిందితుడైన ఆదిత్య అల్వా సీసీబీ ఏజెంట్లు దాడులు ప్రారంభించిన నాటినుంచే కనిపించకుండా పోయారు. ఇప్పటివరకు 15మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.9మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేసు నమోదైనప్పటి నుంచే మాజీ మంత్రి కుమారుడు కనిపించకుండా పోయారని తెలిసింది అందుకే సెర్చ్ వారెంట్ పొందిన తర్వాత సోదాలు నిర్వహించారు.
కాగా నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఆదిత్యా అల్వా బంగ్లానే పార్టీలు నిర్వహించడానికి ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మాజీ మంత్రి కుమారుడికి కూడా ఉచ్చు బిగుసుకుంటోంది.