Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: కాఫీడే సీఎండీ మృతదేహం దొరికింది
By: Tupaki Desk | 31 July 2019 4:27 AM GMTఅనుమానం నిజమైంది. కేఫ్ కాఫీ డే సీఎండీ అదృశ్యం ఎపిసోడ్ విషాదంగా మారింది. సోమవారం రాత్రి నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అనుమానించిన దానికి తగ్గట్లే.. ఆయన మృతదేహం నదిలో లభించింది. దాదాపు 300 మందికి పైగా మంగళవారం మధ్యాహ్నం నుంచి గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున జరిపిన గాలింపు అనంతరం సిద్ధార్థ్ మృతదేహం ఈ రోజు (బుధవారం) ఉదయం లభించింది.
సిద్ధార్థ్ మిస్ అయ్యాక.. ఆయన కోసం వెతుకులాటలో భాగంగా పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రప్పించారు. ఈ జాగిలాలు.. నేత్రావతి నది బ్రిడ్జ్ మధ్య వరకూ వెళ్లి ఆగిపోయాయి. అక్కడ నుంచి ముందుకు కదల్లేదు. వాస్తవానికి.. దీంతోనే ఆయన ఆత్మహత్యపై ఒక అంచనాకు వచ్చారు పోలీసులు. అయితే.. ఏదైనా సాధించే విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తూ.. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన కాఫీడే యజమాని జీవిత ముగింపు ఇలాంటి విషాదంతో ఉంటుందన్నది ఎవరూ అంచనా వేయలేదని చెప్పక తప్పదు.
ఈ నెల 29 సాయంత్రం నేత్రావతి నది వంతెన మీదుగా కారులో వెళుతున్నప్పుడు కారును ఆపాలని డ్రైవర్ కు చెప్పిన సిద్ధార్థ్.. ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్లిపోయారు. గంటకు పైగా తిరిగి రాకపోవటంతో ఆందోళన చెందిన డ్రైవర్.. ఆ సమాచారాన్ని సిద్ధార్థ్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
ఇదిలా ఉంటే.. నదిలోని ఎనిమిదో స్తంభం వద్ద ఒక వ్యక్తి నదిలోకి దూకిన వైనాన్ని తాను చూసినట్లు ఒక జాలరి వెల్లడించినట్లు మాజీ మంత్రి ఖాదర్ చెప్పారు. ఆ సమయంలో తాను ఒంటరిగా ఉండటంతో రక్షించే సాహసం చేయలేకపోయినట్లుగా సదరు జాలరి వెల్లడించారు. అతను చెప్పినట్లే.. తాజాగా నేత్రావతి నదిలో సిద్ధార్థ్ మృతదేహం లభ్యమైంది. ఇదిలా ఉంటే.. ఆయన రాసినట్లుగా చెబుతున్న లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నో ఆశలతో కాఫీ డే సామ్రాజ్యాన్ని స్థాపించినా.. అనుకున్న విజయాన్ని సాధించలేకపోయానని.. తన సంస్థలో సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించినట్లుగా పేర్కొన్నారు. ఆర్థిక నష్టాలు తీవ్రంగా కదిలించినట్లుగా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే.. ఈ లేఖలో సిద్ధార్థ్ చేసిన సంతకం.. కంపెనీ వార్షిక రిపోర్ట్ లో పెట్టే సంతకానికి పోలిక లేదన్న మాట వినిపిస్తోంది. దేశ.. విదేశాల్లో కేఫ్ కాఫీ డే విక్రయ కేంద్రాల్ని నిర్వహిస్తున్న సిద్ధార్థ్.. చిక్ మగలూరు జిల్లాలో దాదాపు 12 వేల కాఫీ తోటల్ని నిర్వహిస్తున్నారు. ఏమైనా.. కాఫీలో ఉండే చేదుకు తగ్గట్లే.. కాఫీ మ్యాన్ గా అభివర్ణించే సిద్ధార్థ్ జీవితం ఎంతకు జీర్ణించుకోలేని చేదుగా ముగిసిపోవటం మాత్రం ఎవరూ ఊహించనిదని చెప్పక తప్పదు.