Begin typing your search above and press return to search.
మాజీ సీఎం అల్లుడు కమ్ పారిశ్రామికవేత్త అదృశ్యం!
By: Tupaki Desk | 30 July 2019 4:39 AM GMTమాజీ ముఖ్యమంత్రి అల్లుడు.. ప్రముఖ పారిశ్రామివేత్త కనిపించకుండా పోయిన వైనం సంచలనంగా మారింది. అందునా.. ఆయన మిస్ అయిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారును ఆపి.. ఫోన్ మాట్లాడేందుకు కారు నుంచి బయటకు వచ్చిన సదరు పెద్దమనిషి.. మాట్లాడుతూ ముందుకెళ్లి కనిపించకుండా పోయారన్న వ్యవహారం షాకింగ్ గా మారింది. ఇంతకూ మిస్ అయిన ఆ ప్రముఖుడు ఎవరో కాదు.. మాజీ ముఖ్యమంత్రి.. బీజేపీ నేత ఎస్ ఎం కృష్ణ అల్లుదు సిద్ధార్ద.
సోమవారం సాయంత్రం నుంచి ఆయన మిస్ అయిన ఉదంతంపై ఇప్పుడు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు సాగుతున్నాయి. ప్రముఖ కాఫీ షాప్ కాఫీ డే యజమాని అయిన సిద్ధార్థ మిస్ అయిన ఉందంతం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం కారులో వెళుతున్న ఆయన.. నేత్రావతి వంతెన మీద వెళుతుండగా.. కారును ఆపించారు. ఫోన్ మాట్లాడుతూ కారులో నుంచి బయటకు వచ్చిన ఆయన నడుచుకుంటూ వెళ్లారు.
అలా కాసేపటికి ఆయన ఎంతకు తిరిగి రాకపోవటంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యారు. యజమాని కోసం వెతికిన ఆయన.. ఎలాంటి ప్రయోజనం లేకపోవటంతో ఆందోళనతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన దక్షిణ కన్నడ పోలీసులు నదీ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు షురూ చేశారు.
గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి నదిలో జల్లెడ పడుతున్నారు. ఫోన్ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు నదిలోకి జారిపడ్డారా? లేక.. ఇంకేమైనా జరిగిందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఎస్ ఎం కృష్ణ నివాసానికి వెళ్లారు. గాలింపు చర్యల్ని సమీక్షిస్తున్నారు. ఇప్పుడీ ఉదంతం పెను సంచలనంగా మారింది.