Begin typing your search above and press return to search.
గూగూల్ పై సీసీఐ విచారణ.. టెక్కీ దిగ్గజానికి కొత్త చిక్కులు
By: Tupaki Desk | 9 Jan 2022 9:30 AM GMTఆన్లైన్ దిగ్గజం గూగుల్ వెబ్ సెట్లకు చెల్లించే రెవెన్యూలో కోత విధిస్తోంది. వైబ్ సైట్ నిర్వాహకులకు, పాఠకులకు మధ్యవర్తిగా ఉండే సెర్చ్ ఇంజిన్ గూగుల్ న్యూస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్(డీఎన్ పీఏ) ఆరోపించింది. ఈ మేరకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో గూగుల్ సంస్థపై చర్యలు తీసుకునేందకు విచారణకు ఆదేశించింది. వార్తలు ప్రచురించే వారిపై పెత్తనం చెలాయిస్తూ వారి లాభాలను అడ్డుకట్ట వేయడం సీసీఐ చట్టానికి విరుద్ధమని డీఎన్ పీఏ ఆరోపించింది.
వెబ్ సెట్లో వార్తలు ప్రచురించిన తరువాత సెర్చి ఇంజన్ దానిని పాఠకులకు చేరవేసేందుకు తోడ్పడుతుంది. ఇందుకు ఆయా వెబ్ సైట్లకు 50 శాతానికి పైగా యాడ్స్ పోస్టు చేస్తుంది గూగుల్. వెబ్ సైట్లకు ప్రధానంగా గూగుల్ సంస్థ నుంచే ఎక్కువగా ఉంటుంది. దీంతో గూగుల్ విధించే నిబంధనలకు ఆయా వెబ్ సైట్లు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ గూగుల్ యాడ్స్ ను కాదనుకుంటే రెవెన్యూ లోటు తీవ్రంగా ఏర్పడుతుంది.
వార్తలు ప్రచురణకు మాధ్యమాలుగా ఉండే సెర్చ్ ఇంజిన్ గూగుల్ న్యూస్ కు అనుకూలంగా ఉందని డీఎన్ పీఏ ఆరోపిస్తోంది. తమ వెబ్ సైట్లను ఎంతో కష్టపడి డెవలప్ చేసుకొని వార్తలు ప్రచురిస్తున్నామని అంటున్నారు. అయితే గూగుల్ నుంచి ఆదాయం అంతంత మాత్రంగానే వస్తోందని అంటున్నారు. అల్గోరిథం, వెబ్ సైట్ ఇండెక్స్లోలో తేడాలుంటున్నాయంటున్నారు. గూగుల్ నుంచి భారీగా యాడ్స్ ఉన్నా అవి సరిసమానంగా రావడం లేదని సమాఖ్య సభ్యులు అంటున్నారు.
గూగుల్ తమకు అనుకూలంగా ఉన్న వెబ్ సైట్లకు మంచి ర్యాంకులు ఇస్తుందని ఆరోపిస్తున్నారు. దీంతో రెవెన్యూ పంపకాల్లో తేడాలు వస్తున్నాయంటున్నారు. ఆన్ లైన్ డిజిటల్ అడ్వర్టయిజింగ్ మధ్యవర్తిత్వ సేవల్లో పారదర్శకత లోపించిందని, దీనివల్ల యాడ్స్ రెవెన్యూ పక్కగా ధ్రువీకరించి ఆడిట్ చేయడం కష్టతరమవుతుందని డీఎన్ పీఏ పేర్కొంటోంది. ఇదిలా ఉండగా డీఎన్ పీఏ ఫిర్యాదును స్వీకరించిన సీసీఐ గుగూల్ పై విచారణకు ఆదేశించింది. వివక్షతో కూడి ధరలు, షరతులను విధించారనే కోణంలో విచారించనున్నారు. అ వ్యవహారంలో 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.