Begin typing your search above and press return to search.
యూకే వైరస్‌ను తేలిగ్గా తీసిపారేయలేం.. సంచలన విషయాలు చెప్పిన సీసీఎంబీ డైరెక్టర్
By: Tupaki Desk | 30 Dec 2020 2:30 PM GMTకొత్తగా వస్తున్న స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ కొత్త స్ట్రెయిన్ భారత్‌లోనూ వ్యాపించింది. ఇప్పటికే మనదేశంలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని కేసులను కొత్త స్ట్రెయిన్ అయి ఉండొచ్చన్న అనుమానంతో కొందరి నమూనాలను పూణే లోని ల్యాబ్ కు పంపారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త స్ట్రెయిన్‌పై హైదరాబాద్ సీసీఎంబీ డైరెకర్ట్ రాకేశ్ మిశ్రా పలు సంచలన విషయాలు వెల్లడించారు.
మనదేశంలో యూకే నుంచి వచ్చిన వ్యక్తుల శాంపిళ్లను సీసీఎంబీలో పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీసీఎంబీలో సుమారు నలభై శాంపిళ్లను పరీక్షించారు. అందులో కొన్నింటిలో కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు. అయితే సీసీఎంబీలో మొత్తం 40 శాంపిళ్లను పరీక్షించారు.
ఈ నేపథ్యంలో రాకేశ్‌మిశ్రా కొత్త స్ట్రెయిన్ ప్రభావం ఎలా ఉంటుంది. ఒకవేళ భారత్ లోకి కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తే పరిస్థితులు ఏమిటి తదితర విషయాల గురించి చెప్పారు. ఆయన ఏమన్నారంటే.. ‘ కొత్త స్ట్రెయిన్ డేంజర్ ఏమీ కాదు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాత కరోనా కంటే కొత్త స్ట్రెయిన్ చాలా వేగంగా వ్యాపిస్తున్నది.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో బయటపడుతున్న కేసుల్లో 60 శాతం కొత్త కేసులే నమోదవుతున్నాయి. కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందితే.. ఆస్పత్రులు కూడా సరిపోవు. ఇప్పటికే బ్రిటన్‌లో లాక్డౌన్ విధించారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. ఒక నెలరోజులపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఈ కొత్త స్ట్రెయిన్నుంచి బయటపడొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.