Begin typing your search above and press return to search.
వీడియో గురించి 4 నెలల ముందే తెలుసు.. తాను కాదని పట్టించుకోలేదట
By: Tupaki Desk | 17 March 2021 4:30 AM GMTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కి హోళి రాసలీలల వీడియోకు సంబంధించి రోజుకో ఆసక్తికర అప్డేట్ బయటకు వస్తోంది. సదరు వీడియోలో ఉన్నది తాను కాదని చెబుతున్న మాజీ మంత్రి రమేశ్.. తాజాగా అదే విషయాన్ని మరోసారి చెప్పటం గమనార్హం. ఉద్యోగం కోసం వచ్చిన యువతితో రాసలీలలు చేసిన వీడియో బయటకొచ్చి వైరల్ కావటం.. తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావటం తెలిసిందే. అయితే.. అందులో ఉన్నది తాను కాదని.. నకిలీ సీడీతో రాజకీయంగా తననుదెబ్బ తీయాలని ప్లాన్ చేసినట్లు ఆయన వాదిస్తున్నారు.
తాజాగా బెంగళూరులోని ఆయన నివాసంతో ఈ కేసు విషయంలో సిట్ అధికారులు రెండు గంటల పాటు రమేశ్ ను విచారించారు. ఈ సందర్భంగా నాలుగు పేజీల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రాసలీలల వీడియో గురించి తనకు నాలుగు నెలల క్రితమే తెలుసని మాజీ మంత్రి చెప్పటం గమనార్హం. అయితే.. అందులో ఉన్నది తాను కాదని.. సదరు సీడీ నకిలీది కావటంతో తాను పట్టించుకోలేదని చెప్పినట్లు తెలిసిందే.
సదరు సీడీని చూపించి తనను రూ.5కోట్లు అడిగారని.. తాను ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదన్నారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఇలాంటి నకిలీ సీడీతో కుట్ర పన్నినట్లుగా పేర్కొన్నారు. సదరు వీడియోలో ఉన్నది తానుకాదని.. తనకు.. సదరు సీడీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి తేల్చేయటం గమనార్హం. మరోవైపు.. సీడీలో కనిపించిన యువతి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. ఆమె ఇచ్చే వాంగ్మూలం ఈ కేసుకు కీలకంగా మారనుంది. హైదరాబాద్ లో ఉందని భావిస్తున్న ఆమె ఆచూకీ ఇప్పటికి గుర్తించలేకపోయారు దర్యాప్తు అధికారులు.