Begin typing your search above and press return to search.
షాకింగ్ న్యూస్: మరికొన్ని కరోనా లక్షణాలు వెలుగులోకి..
By: Tupaki Desk | 27 April 2020 12:10 PM GMTకరోనా వైరస్‌కు సంబంధించిన అధ్యయనం అన్ని దేశాల్లో విస్తృతంగా సాగుతోంది. ఆ వైరస్‌కు సంబంధించిన అంశాలపై శాస్త్ర్రవేత్తలు, పరిశోధకులు, విశ్వవిద్యాలయాలు అధ్యయనం చేస్తున్నాయి. ఆ వైరస్ పుట్టు పూర్వోత్తరాల నుంచి ఆ వైరస్ విజృంభించడానికి కారణాలు, కట్టడి చేయడానికి విరుగుడు కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో కరోనా వైరస్ విషయంలో రోజుకొక ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఇన్నాళ్లు కరోనా లక్షణాలు జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లు, గొంతునొప్పులు అనుకుంటే ఇప్పుడు మరిన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ వైరస్‌కు సంబంధించిన లక్షణాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆ వైరస్‌కు సంబంధించిన ఆరు కొత్త లక్షణాలను అమెరికా గుర్తించింది.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ మానవాళి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో దానికి సంబంధించిన మరిన్ని కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలే కరోనాను గుర్తించేందుకు ప్రధాన లక్షణాలని అందరికీ తెలిసిందే. అయితే వీటితో పాటు మరికొన్ని లక్షణాలు ఉన్నాయని అమెరికాకి చెందిన ఓ సంస్థ గుర్తించింది. ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ (సీడీసీ) తన అధ్యయనంలో ఆరు కొత్త లక్షణాలు ఉన్నాయని వెల్లడించింది. చలి, అస్తమానం చలితో కూడిన వణుకు, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, రుచి, వాసన గుర్తించలేకపోవడం వంటివి కూడా కరోనా లక్షణాలుగా ఆ సంస్థ పేర్కొంది. సాధారణ లక్షణాలతో పాటు ఇవి అదనంగా ఉంటాయని ఆ సంస్థ వివరించింది. ఇన్నేసి లక్షణాలు కరోనా ఉంటే ఇక ఏ వ్యాధి వచ్చినా కరోనాగా భావించాల్సి వస్తోందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.