Begin typing your search above and press return to search.
పెళ్లికి మించి గ్రాండ్ గా విడాకుల పార్టీ
By: Tupaki Desk | 12 Sep 2022 7:35 AM GMTపెళ్లంటే నూరేళ్ల పంట కాదు.. మంట అని వాపోతున్నారు మగాళ్లు. కొందరు భార్యా బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. భార్యల చేతిలో నలిగిపోతున్న వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు మరీ.. సుధీర్ఘ న్యాయపోరాటం తర్వాత విడాకులు పొందిన 18మంది మగవారికి ఒక ఎన్జీవో సంస్థ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఇదే .. ఈ వేడుకలో రకరకాలైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. అందులో ముఖ్యంగా జయమాల విసర్జన్ , మగవాళ్ల సంగీతం, సామాజిక సేవ కోసం ప్రతిజ్ఞలు , మనస్సాక్షిని శుభ్రపరిచే అగ్ని ఆచారం వంటి ఈవెంట్స్ ఉన్నాయి. దీనికి సంబందించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2014లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో 'భాయ్ సంక్షేమ సంఘం' అనే స్వచ్ఛంద సంస్థ లేదా ఎన్జీవో ఏర్పడింది. విడాకులు కోరుతున్న పురుషులకు ఈ ఎన్జీవో అండగా ఉంటోంది. వేధింపులతో నిత్యం నరకం చూపిస్తున్న భార్యల నుంచి భర్తలు విడాకులు పొందేందుకు న్యాయపోరాటంలో వారికి సహాయం చేస్తోంది. తమ అండతో విడాకులు పొందిన మగవారి కోసం ఘనంగా సంబరాలు కూడా జరుపుకుంటోంది.
అయితే కరోనా వల్ల గత మూడేళ్లుగా ఎలాంటి వేడుకలు నిర్వహించలేదు. అయితే గత మూడేళ్లలో 'భాయ్' సంక్షేమ సంఘం సహకారంతో దీర్గకాలికంగా న్యాయపోరాటం తర్వాత 18 మంది మగవారు విడాకులు పొందారు.
ఈ నేపథ్యంలోనే కనివినీ ఎరుగని రీతిలో విడాకులు తీసుకున్న ఆ 18 మంది కోసం భోపాల్ శివారులోని రిసార్ట్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఆ ఎన్టీవో సంస్థ సిద్ధమైంది. దీని కోసం 'విడాకుల ఆహ్వానం' పేరుతో ఓ ఇన్విటేషన్ ను కూడా ప్రింట్ చేయించింది. ఈ విడాకుల వేడుక సెప్టెంబర్ 18న జరుగనుంది.
ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు భాయ్ సంక్షేమ సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలో రకరకాలైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. వాటికి సంబంధించిన విశేషాలను సైతం ఆహ్వాన పత్రికలో ప్రింట్ చేయించింది. 18 మందిలో కొంతమంది ఏళ్ల తరబడి విడాకుల కోసం పోరాడాల్సి వచ్చిందని.. వేచి చూడాల్సి వచ్చిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ నేపథ్యంలో వారి విడాకులను సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో కొద్దిమందితో దీనిని ప్లాన్ చేశారు. కానీ ఆహ్వాన పత్రిక వైరల్ అవ్వడంతో ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపేందుకు రీ డిజైన్ చేశారు. విడాకులు తీసుకున్న ఈ మగవాళ్లు తమ కొత్త జీవితాలను సానుకూల మనస్తత్వంతో మరింత ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్లేందుకు ఈ వేడుక ఒక మార్గమని ఆ ఎన్జీవో తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.