Begin typing your search above and press return to search.

భారత్ - పాక్ మ్యాచ్ చూస్తే ఎంత కిక్కో.. ఈ చిట్టి వీడియో చూసినా అంతే!

By:  Tupaki Desk   |   24 Oct 2022 3:54 AM GMT
భారత్ - పాక్ మ్యాచ్ చూస్తే ఎంత కిక్కో.. ఈ చిట్టి వీడియో చూసినా అంతే!
X
అంతులేని ఆనందాన్ని మాటలతో చెప్పటం కొన్నిసార్లు కష్టమే అవుతుంది. కానీ.. ఆ సందర్భాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించే విజువల్ చూస్తే ఆ ఆనందమే వేరు. ఆ భావోద్వేగాన్ని ఇట్టే ఒడిసిపట్టేందుకు వీడియోకి మించిన మాధ్యమం మరొకటి ఉండదు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా దాయాది పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా.

ఈ మ్యాచ్ విన్నింగ్ షాట్ కొట్టినంతనే.. టీవీల్లో లైవ్ చూస్తున్న కోట్లాది మంది ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒక రోజు ముందే దీపావళి వచ్చినంతగా సంతోషానికి గురయ్యారు.

మ్యాచ్ లో గెలుపు ఆనందాన్నే ఇచ్చినా.. తాజా మ్యాచ్ మాత్రం అంతులేని ఆనందాన్ని.. అంతకు మించిన మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది. పోటాపోటీగా సాగటమే కాదు.. ఆశలే లేని మ్యాచ్ ను అద్భుత విజయాన్ని సాధించేలా చేసిన కోహ్లీ తిరుగులేని హీరోగా మారితే.. ఈ విజయాన్ని మాజీ దిగ్గజాలు సైతం చిన్న పిల్లల మాదిరి మారారు.

మ్యాచ్ చివరి బంతికి.. విజయానికి కావాల్సిన ఒక్క పరుగును రవిచంద్రన్ అశ్విన్ తీసినంతనే.. 90 వేల మందితో కిక్కిరిసిన మెల్ బోర్న్ మైదానంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

స్టేడియంలో ఉన్న మాజీ క్రికెటర్లు సునీల్ గవస్కర్.. క్రిష్ణమాచారి శ్రీకాంత్..ఇర్ఫాన్ పటేల్ లు అయితే.. చిన్న పిల్లల మాదిరి మారారు. ముఖ్యంగా.. చేతిలో లెదట్ సూట్ కేస్ పట్టుకొని.. ఫలితం ఏమవుతుందన్న టెన్షన్ లో ఉన్న శ్రీకాంత్.. విన్నింగ్ షాట్ కొట్టినంతనే ఆనందంతో ఎగిరి గంతేశారు. ఆయన పక్కనే ఉన్నా సునీల్ గవస్కర్ సైతం తన స్థాయిని వదిలేసి.. పిల్లాడి మాదిరి గెంతులేసిన వైనం అందరిని ఆకట్టుకుంది.

ఇక.. ఇర్ఫాన్ పఠాన్ సైతం ఒక్కసారిగా టెన్షన్ రిలీఫ్ అయి.. తన విజయానందాన్ని వ్యక్తం చేశారు. ఈ అద్భుత సీన్ ను.. స్టేడియంలోని కెమేరాలు క్యాప్చర్ చేయటం.. దాన్ని కట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. గంటల వ్యవధిలో ఈ వీడియోను 8.9 లక్షల మంది వీక్షించటం చూస్తే.. ఈ వీడియో ఎంతలా వైరల్ అయ్యిందో ఇట్టే అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం..మీరు కూడా చూసేయండి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.