Begin typing your search above and press return to search.
జగన్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలా..
By: Tupaki Desk | 30 May 2019 10:30 AM GMTవైఎస్ జగన్మోహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు దేశ, విదేశాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ట్విట్టర్, ఫేస్ బుక్ లలో అభినందిస్తున్నారు. ఇక దేశంలోని ప్రముఖులు కూడా జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక స్పందించారు. ఎవరేమన్నారనే దానిపై స్పెషల్ ఫోకస్..
*జగన్ ముఖ్యమంత్రి అవుతాడనే ముందే చెప్పా: మోహన్ బాబు
వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడే జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని తాను ఆనాడే చెప్పానని మోహన్ బాబు అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని తెలియదు కానీ.. జగన్ పట్టువదలని విక్రమార్కుడిలా కృషి, పట్టుదల ప్రదర్శించాడు. భగవంతుడు, వైఎస్ ఆశీస్సులు, జగన్ తల్లి విజయమ్మ దీవెనలతో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అని కొనియాడారు. నా 44 ఏళ్ల నటజీవితంలో 3648 కి.మీలు నడిచిన వ్యక్తిని చూడడం ఇదే తొలిసారి.. మానవ సాధ్యం కానీ నడక అదీ.. చరిత్రలో చెరిగిపోని నిజమిది అని మోహన్ బాబు కొనియాడారు.
*వైఎస్ చనిపోయినప్పుడే 95శాతం మద్దతిచ్చాం : జయసుద
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడే ఆయన స్థానంలో సీఎంను జగన్ ను చేయాలని పార్టీలోని 95శాతం మంది మద్దతు ఇచ్చాం. ఎమ్మెల్యే అయిన నేనూ మద్దతు తెలిపాను. ఎందరు ఎదురుతిరిగినా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేశాడు. కేసులు పెట్టి జైళ్లకు పంపినా.. ఇబ్బందులు పెట్టినా గట్టిగా తయారై పాదయాత్రతో యువతరానికి ఐకాన్ గా మారి సీఎం అయ్యాడు. స్టాలిన్, భరత్ అనే నేను సినిమాలు చూసి ఇది నిజంగా అవుతుందా అనుకున్న జగన్ గెలిచి అది హీరోలకే హీరో అని నిరూపించుకున్నాడని జయసుధ తెలిపింది.
*ప్రజానాయకుడు జగన్ : జయప్రద..
వైఎస్ ను చూసి ఆయనలా బాగా నేర్చుకున్నాడు జగన్. ప్రజల మధ్యనే ఉంటూ 3648 కి.మీలు పాదయాత్ర చేశాడు. కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ ఈ ఎన్నికల్లో గెలిచాడు. జగన్ కు నా అభినందనలు అంటూ జయప్రద శుభాకాంక్షలు తెలిపింది.
*కాంగ్రెస్ లో ఉంటే ఎప్పుడో సీఎం అయ్యేవారు: పోసాని
వైఎస్ జగన్ కాంగ్రెస్ లోనే నార్మల్ గా ఉంటే ఎప్పుడో సీఎం అయ్యావరే. ఆయనను అణిచివేశారు. జగన్ పై ఎంత ప్రచారం చేసినా.. జైల్లో పెట్టినా.. దేవుడున్నాడు. జగన్ ను గుర్తించాడు. ఈ క్రెడిట్ జగన్ ది కాదు.. ప్రజలది..డబ్బులతో కొనేద్దామని చంద్రబాబు చూసినా.. ప్రజలను ప్రేమతో గెలిచాడు జగన్..
*జగన్ ను చూసి మా జీవితాలను చాలా మార్చుకున్నా: ఫృథ్వీరాజ్
కుటుంబానికి దూరంగా 14 నెలల పాటు ఉండడం.. ఎండనకా..పగలనాకా కష్టాలు పడ్డ జగన్ త్యాగం వెలకట్టలేనిది. నేను కూడా జగన్ తో పాలకొల్లులో పాదయాత్ర చేశాను. రోహిణికార్తెలో 6 కి.మీలు నడిచేసరికి నా వల్ల కాలేదు. జగన్ పట్టుదల, ప్రజలు చూసే సీఎంను చేశారు. ఆయన జీవితాన్ని చూసి చాలా నేర్చుకున్నానని టాలీవుడ్ నటుడు ఫృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు.
* జగన్ లో సాధించాలనే తపన ఉంది: ఉండవల్లి
జగన్ కూడా వైఎస్ఆర్ లాగానే ముక్కుసూటి నిర్మోహమాటం. ఆయనకు ప్రజలకు ఏదో చేయాలనే తపన పట్టుదల, కసి ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా జగన్ పట్టుదలను చూసే గెలిపించారు. పాదయాత్రతో జగన్ ప్రజల మనసు గెలిచారు. అవినీతి రహిత పాలన ఇస్తానంటునంటున్నాడు. బలమైన మీడియా జగన్ కోసం సిద్ధంగా ఉంది.. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే జగన్ కు తిరుగుండదు అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.