Begin typing your search above and press return to search.

జార్జ్‌‌ కి కన్నీటి వీడ్కోలు ...హాజరైన ప్రముఖులు

By:  Tupaki Desk   |   10 Jun 2020 9:30 AM GMT
జార్జ్‌‌ కి కన్నీటి వీడ్కోలు ...హాజరైన ప్రముఖులు
X
శ్వేత జాతీ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురయిన ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ అంత్యక్రియలని అయన స్వస్థలమైన హ్యూస్టన్‌ లో మంగళవారం నిర్వహించారు. న తల్లి సమాధి పక్కనే ఆయన మృతదేహాన్ని కూడా ఖననం చేశారు. ఆరు రోజుల సంతాప దినాల తర్వాత మూడు నగరాల్లో ఫ్లాయిడ్‌ మృతదేహాన్ని ప్రదర్శించారు. ఫ్లాయిడ్‌ పుట్టిన నార్త్ కరోలినాలోని రేఫోర్డ్‌, అతను పెరిగిన హ్యూస్టన్, అతడు మరణించిన మిన్నియాపాలిస్ నగరాల్లో ప్రదర్శించారు.

ఈ సందర్భంలో వేలాది మంది జార్జ్‌ మృతదేహానికి నివాళులర్పించేందుకు తరలి వచ్చారు. వీరిలో నటులు జామీ ఫాక్స్, చాన్నింగ్ టాటమ్, రాపర్ ట్రే థా ట్రూత్, రిపబ్లిక్ షీలా జాక్సన్ లీ, హూస్టన్ పోలీస్ చీఫ్ ఆర్ట్ అసేవెడో, హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్, గ్రామీ విజేత నే-యో కూడా ఉన్నారు.

మాజీ వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్, ఫ్లాయిడ్‌ ఆరేళ్ల కుమార్తెను ఉద్దేశిస్తూ.. ‘ఏ పిల్లలు అడగలేని చాలా ప్రశ్నలు నీ మదిలో తలెత్తుతున్నాయని నాకు తెలుసు. తరాలుగా నల్ల జాతి పిల్లలంతా ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. జాత్యాంహకారాన్ని రూపమాపడానికి.. సమ న్యాయం చేయడానికి. భవిష్యత్తులో మన పిల్లలు ఎందుకు ఇలా జరిగింది అంటే మనం సమాధానం చెప్పగలగాలి’ అన్నారు.