Begin typing your search above and press return to search.
ఓటేసిన సినీ ప్రముఖులు వీరే..
By: Tupaki Desk | 7 Dec 2018 4:10 AM GMTఓటు.. ఐదేళ్లకోసారి మాత్రమే ఈ ఆయుధాన్ని వినియోగించుకోవాలి. తెలంగాణ బరిలో అందరూ ఓటును ఉపయోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. తెలంగాణవ్యాప్తంగా పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. ఉదయం 6.30 నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.
ఇక హైదరాబాద్ లో సెలబ్రెటీలు ఓటేయడానికి రావడం విశేషంగా చెప్పవచ్చు. సాధారణ పౌరుల్లాగే క్యూలో నిలబడి సినీ ప్రముఖులు ఓటేయడం విశేషయం. ఉదయం 9 గంటలలోపే ఖైరాతాబాద్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రంలో ప్రథమ పౌరుడు గవర్నర్ నరసింహన్, ఆయన భార్య విమలా రామన్ ఓటు వేశారు. ప్రజలు - సెలబ్రెటీలు - ప్రముఖులు అంతా ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును ఈ ఉదయం వినియోగించుకున్నారు. జూబ్లి క్లబ్ లో కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి ఓటు వేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ - ఆయన తల్లి - భార్యతో కలిసి క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అల్లు అర్జున్ ఉదయమే పోలింగ్ కేంద్రానికి ఒక్కడే వచ్చి క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. నాగార్జున, అమలలు ఉదయం సతీసమేతంగా వచ్చి ఓటేశారు.