Begin typing your search above and press return to search.

విల్లా సమంటే అదీ..

By:  Tupaki Desk   |   25 Nov 2015 5:30 PM GMT
విల్లా సమంటే అదీ..
X
ఆ ఇళ్లను చూస్తే ఇంద్ర భవనం అంటే ఎలా ఉంటున్నది అర్థమవుతుంది. అక్కడ దేనికీ లోటుండదు.. సకల సౌకర్యాలు అక్కడుంటాయి. ప్రపంచంలో అత్యంత ప్రముఖులు కొందరు నిర్మించుకున్న ఇళ్లను చూస్తే వారెవ్వా అనక తప్పదు. ఊహలకందనంత గొప్పగా ఉండే ఆ భవంతుల్లో ఎన్నో సౌకర్యాలు.. కొన్ని సహజమైనవి, ఇంకొన్ని కృత్రిమమైనవి. కోరుకున్నదేదైనా అక్కడుండాల్సిందే. కృత్రిమ బీచ్‌ లు - గోల్ఫ్‌ కోర్స్ లు - డాల్ఫిన్లున్న సరస్సులు... ఒకటేమిటి ఎన్నో హంగులు ఆ భవంతుల సొంతం.

మడోన్నా దుబాయ్ సౌధం

పాప్‌స్టార్ మడోన్నాకు అమెరికా - బ్రిటన్లలో అదిరిపోయే భవనాలున్నాయి. అయితే... దుబాయిలో ఆమెకు ఉన్న సౌధం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఈ భవంతి లివింగ్ రూమ్ కింద అండర్ గ్రౌండ్ లో చాలా పెద్ద ఆక్వేరియం ఉందట. అందులో డాల్ఫిన్లు కూడా ఉన్నాయి. ఆక్వేరియం పైకప్పే - లివింగ్ రూం ఫ్లోరన్నమాట. అంటే... ఇంకేముంది.. లివింగ్ రూంలో అడుగుపెడితే కాళ్ల కింద నీరు - అందులో ఆక్వేరియం కనిపిస్తాయి. అంతేకాదు... ఈ విల్లా వద్ద 1400 మీటర్ల పొడవున్న సొంత బీచ్ ఉంది.

ముకేష్ అంబానీ

పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ భవంతి ప్రపంచంలో అతి ఖరీదైన భవంతుల్లో ఒకటి. ముంబైలో 27 అంతస్తులతో కూడిన భారీ బిల్డింగ్ ఇది. ప్రపంచంలోనే ఇంత ఎత్తున్న సుమారు 60 భవనాలతో ఇది పోటీపడింది. షికాగోకు చెందిన పెర్కిన్స్ - విల్ అనే ఆర్కిటెక్ట్‌ లు ఈ భవంతిని నిర్మించారు. ఎంతటి భారీ భూకంపాలనైనా తట్టుకోవడం దీని ప్రత్యేకత.

జార్జ్ క్లూనీ(ఇటలీ)

హాలీవుడ్ అందగాడు జార్జ్ క్లూనీ ఇటలీలోని కోమో సరస్సు తీరంలో నిర్మించిన విల్లా అద్భుతంగా ఉంటుంది. 25 గదుల ఈ భవనంలో స్విమ్మింగ్‌ పూల్ - ఔట్ డోర్ థియేటర్ వున్నాయి. క్లూనీకి ఇష్టమైన బైక్‌ లతో కూడిన గ్యారేజ్ కూడా ఇక్కడ ఉంది.

బాక్సర్ మెనీ పక్వియా(అమెరికా)

పాపులర్ బాక్సర్ మెనీ పక్వియా భవంతి కాలిఫోర్నియాలోవుంది. 10 వేల చదరపు అడుగుల ఈ సౌధంలో 7 బెడ్ రూములు - 8 బాత్ రూమ్‌ లు - థియేటర్ వంటివెన్నో ఉన్నాయి.

మెజీషియన్ డేవిడ్ కాపర్‌ ఫీల్డ్ (బహమాస్)

ప్రముఖ మెజీషియన్ డేవిడ్ కాఫర్‌ ఫీల్డ్‌కు బహమాస్‌ లో చాలాపెద్ద భవంతి ఉంది. అక్కడ సొంతంగా ఆయనకు 11 బీచులు ఉన్నాయి. ఖాళీ దొరికితే చాలు మనోడు అక్కడ ఫుల్లు ఎంజాయ్ చేస్తాడట.

జానీ డెప్(ఫ్రాన్స్)

నటుడు - మ్యూజీషియన్ - ప్రొడ్యూసర్ జానీ డెప్‌ కు ఫ్రాన్స్‌ లో ఏకంగా ఓ గ్రామమే వుంది. 10 మిలియన్ డాలర్లతో బార్ - రెస్టారెంట్ - గెస్ట్ కాటేజీలతో కూడిన విల్లాను అక్కడ కట్టుకున్నాడు.


కర్ట్ రసెల్ - గోల్డీ హాన్(కెనడా)

నటీనటులు గోల్డీ హాన్ - కర్ట్ రసెల్ ఇద్దరికీ కెనడాలో సువిశాలమైన భవనం వుంది. ఐదు బెడ్‌ రూమ్‌ లతో కూడిన ఈ బిల్డింగ్‌ లో థియేటర్ - చలికాచుకోవడానికి 11 ఫైర్ ప్లేసెస్‌ లు ఉన్నాయి. ఇక్కడ ఎంత చల్లని రాత్రయినా వెచ్చగా గడిచిపోతుందంటారు వీరు.

అమల్ క్లూనే(ఇంగ్లండ్)

అమల్ క్లూనేతో కలిసి జార్జ్‌ క్లూనే ఇంగ్లాండ్‌ లో 9 బెడ్ రూమ్‌ లతో కూడిన భవంతిని నిర్మించుకున్నాడు. ఇందులో థియేటర్ - స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయి.

వ్లాదిమిర్ పుతిన్(స్పెయిన్)

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కు స్పెయిన్‌ లోనేకాక యూరప్‌ లోనూ విల్లాలున్నాయి. స్పా - సినిమా హాల్ - జిమ్ వంటివెన్నో వీటిలో ఉండడం విశేషం. పుతిన్ తరచూ ఇక్కడ విడిదిచేస్తుంటారు.

జాక్ మా(హాంకాంగ్)

చైనాకు చెందిన ఈ బిజినెస్‌ మేన్‌ అలీబాబా.కామ్ కు అధినేత. ఈయనకు హాంగ్‌ కాంగ్‌ లో లగ్జరీ బంగ్లా వుంది. 193 మిలియన్ డాలర్ల ఖరీదైన ఈ బంగ్లాను 10 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. 270 డిగ్రీల కోణం నుంచి ఫేమస్ విక్టోరియా హార్బర్‌ ను చూడవచ్చు.