Begin typing your search above and press return to search.
రాష్ట్రపతి -ప్రధాని-ఇద్దరు చంద్రుళ్లు-సచిన్...అందరూ షాకైపోయారు
By: Tupaki Desk | 25 Feb 2018 6:52 AM GMTసినీనటి శ్రీదేవి మృతికి సినీరంగమే కాకుండా అన్ని రంగాలకు చెందినవారూ షాక్‌కు గురయ్యారు. దేశ ప్రథమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ - ప్రధాని మోదీ - ఉఫ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు - తెలుగు రాష్ట్రాల సీఎంలు - ఏపీ విపక్ష నేత జగన్ - తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంతోపాటు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ - టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ - క్లాసిక్ క్రికెటర్ లక్ష్మణ్ - తెలంగాణ యువనేత కేటీఆర్ వంటి ప్రముఖులంతా శ్రీదేవి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్రపతి కోవింద్ సినీరంగం ఓ గొప్ప నటిని కోల్పోయిందన్నారు. ‘‘లక్షలాది అభిమానుల గుండె పగిలే వార్తతో ఆమె విడిచిపెట్టి వెళ్లారు. మూడ్రమ్ పిరై - లమ్హే - ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాలు ఇతర నటులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి. ఆమె కుటుంబ సభ్యులు - సన్నిహితులకు నా సంతాపం’’ అంటూ రామ్ నాథ్ కోవింగ్ ట్వీట్ చేశారు.
శ్రీదేవి ఆకస్మిక - అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో ఎంతో సీనియర్ అయిన ఆమె వైవిధ్య పాత్రలతో - చిరస్మరణీయ నటన ప్రదర్శించారని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈ సమయం లో తన ఆలోచనలన్నీ ఆమె వెంటే ఉన్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
శ్రీదేవి అకాల మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. తెలుగు - దక్షిణాది సినిమాలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటించిన ఆమెను ఎంతో బహుముఖ - వైవిధ్య ప్రతిభ కలిగిన నటిగా కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ - శ్రీదేవి మృతి చెందారన్న వార్త తనను బాధకు గురి చేసిందని చెప్పారు. బహుభాషా నటిగా - అసమానమైన తన అభినయంతో దేశం గర్వించదగ్గ స్థాయికి ఆమె ఎదిగారని అన్నారు. తెలుగువారికి ఎంతో ఇష్టమైన నటి శ్రీదేవి అని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు - తెలుగు సినిమా అభిమానులకు తీరని లోటును మిగులుస్తుందని ఆయన అన్నారు. ఎన్నో సినిమాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన శ్రీదేవి... అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. తన అందం - అభినయం - నాట్యాలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. ఎన్నో భాషలలో నటించి - మెప్పించిన ఘనత ఆమె సొంతమని అన్నారు.
శ్రీదేవి మరణం పట్ల వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ... ‘శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నటన, ఛరిష్మాతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఆమె. దక్షిణ భాషలతోపాటు బాలీవుడ్‌లోనూ ఆమె నటించి అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. మరచిపోలేని పాత్రలేన్నో ఆమె పోషించి మెప్పించారు. ఇంగ్లీష్ వింగ్లీష్‌లో గృహిణి పాత్ర శ్రీదేవి ఎంతటి అసమాన నటి అన్న విషయం తెలియజేసింది..
ఆ లెజెండరీ నటి మృతి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు - ముఖ్యంగా ఆమెను అభిమానించే వారికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ... ఇటీవలే ఒక కార్యక్రమంలో శ్రీదేవిని కలిశానని.. ఆమె వినయం ఆశ్చర్యానికి గురిచేసిందని.. అంత గొప్ప నటి అంత వినయంగా ఉండడం తనకు స్ఫూర్తి కలిగించిందని ఆయన అన్నారు.
ఆమె సినిమాలు చూస్తూ పెరిగామని.. ఈ వార్త తెలిసి నోట మాట రావడం లేదని - ఆమె మరణించారన్న విషయం జీర్ణించుకోవడం కష్టమని సచిన్ టెండూల్కర్ అన్నారు.
భారతదేశపు అత్యంత అందమైన - ప్రతిభావంతురాలైన నటి శ్రీదేవి మరణం చాలా బాధ కలిగించిందని.. ఆమె ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని విరాట్ కోహ్లీ అన్నారు.
ఐకానిక్ యాక్ట్రెస్ శ్రీదేవి మరణం షాక్ కు గురిచేసిందని వీవీఎస్ లక్ష్మన్ ట్వీట్ చేశారు.