Begin typing your search above and press return to search.

అక్కడసలు సెల్ ను పెట్టకూడదు బాస్

By:  Tupaki Desk   |   26 Feb 2016 10:30 PM GMT
అక్కడసలు సెల్ ను పెట్టకూడదు బాస్
X
జేబులో డబ్బులు ఉన్నా లేకున్నా ఫర్లేదు.. చేతిలో సెల్ ఫోన్ మాత్రం తప్పనిసరైన పరిస్థితి. డిజిటల్ ప్రపంచంలో సెల్ లేని మనిషి ఒక మనిషేనా? అన్నట్లుగా మారింది. సెల్ లేకుంటే క్షణం కూడా జరగని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. సెల్ ఆధారిత సేవలు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో.. సెల్ లేకపోవటం అంటే.. చాలానే కోల్పోయినట్లే.

జీవితంలో ఒక అవయువంగా మారిపోయిన సెల్ కు సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని చెబుతున్నారు టెక్ నిఫుణులు. ఇప్పటి స్మార్ట్ ఫోన్లకు సంబంధించి కీలకమైన బ్యాటరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇందుకోసం నాలుగు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సెల్ ఫోన్ ను పెట్టకూడని నాలుగు ప్రదేశాలేమంటే.. ఒకటి బ్యాక్ పాకెట్.. రెండోది.. ఫ్రిజ్ లు.. ఏసీలకు దగ్గరగా ఉండటం.. మూడోది.. ఎండలో పెట్టటం.. నాలుగోది.. వంటింల్లో స్టవ్.. మైక్రోఒవెన్లకు దూరంగా ఉంచాలని చెబుతున్నారు.

ఈ నాలుగు చోట్ల సెల్ ఫోన్ ని ఉంచితే దాని బ్యాటరీ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించటంతో పాటు.. ఫోన్ చెడిపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత.. అదే సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రతలకు దగ్గర కాకుండా నార్మల్ కండీషన్లలో ఉంచటం మంచిది. లేదంటే.. సెల్ ఫోన్ జబ్బున పడటం ఖాయం.