Begin typing your search above and press return to search.

పురుషులక్ షాక్..: సెల్ వాడకం వల్ల ఆ సమస్య రావచ్చు..

By:  Tupaki Desk   |   29 Jan 2022 3:28 AM GMT
పురుషులక్ షాక్..: సెల్ వాడకం వల్ల ఆ సమస్య రావచ్చు..
X
ఉదయం లేచిందగ్గర్నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మనిషితో ఉండే ఒకే ఒక నేస్తం సెల్ ఫోన్. ఒకప్పుడు ప్రతి ఒక్కరు మనుషులతో సంబంధాలు పెట్టుకుంటే.. నేడు ప్రతీ విషయానికి మొబైల్ తోనే మమేకమవుతున్నారు. ఒక దశలో సెల్ ఫోన్ లేకపోతే ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఈ గాడ్జెట్ కు అడిక్టయ్యారు. సరదా కోసమేకాకుండా వ్యాపార వ్యవహారాల్లో, సమావేశాల్లోనూ మొబైల్ నిర్వహిస్తోంది. దీంతో సెల్ వాడకం తప్పనిసరి అయింది. అయితే సెల్ అతిగా వాడడం వల్ల జరిగే నష్టాలేంటో ఇప్పటికే చాలా మంది వైద్య నిపుణులు తెలిపారు. అయితే తాజాగా ‘మెటానాలిసిస్’ చేసిన ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ లోపలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

‘మెటానాలిసిస్’ చేసిన పరిశోధన ప్రకారం.. సెల్ ఫోన్ అతిగా వాడితే పురుషుల్లో జరిగే నష్టాల గురించి బయటపడింది. మితిమీరిన మొబైల్ వాడకంతో పురుషుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం జరిగే ప్రమాదం ఉందని తెలిపింది. పురుషుల్లో ఉండే స్పెర్మ్ నాణ్యతను రక్షించడానికి మొబైల్ వాడకాన్ని తగ్గించాలని పరిశోధకులు తెలుపుతున్నారు. సెల్ ఫోన్లు విడుదల చేసే రేడియోఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లు స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుందని తెలిపారు. స్పెర్మ్ లేదా శుక్ర కణాలు చురుగ్గా అండం వైపు కదిలినప్పుడే గర్భధారణ సాధ్యమవుతుంది. లేకపోతే ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు.

ఈ అధ్యయనం గురించి నేషనల్ యూనివర్సిటీ పరిశోధకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ యున్ హక్ కిమ్ మాట్లాడారు. పురుషులు సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోకపోతే వారి స్పెర్మ్ నాణ్యత లోపిస్తుంది. అవి విడుదల చేసే ఆర్ఎఫ్ఈఎమ్ డబ్ల్యూలను మానవ శరీరం గ్రహిస్తుందని, అవి మెదడు, గుండె, పునరుత్పత్తి పనితీరుపై ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నాడు. కాగా సెల్ ఫోన్ వాడకం వల్ల జరిగే నష్టాలపై 2012 నుంచే పరిశోధనలు జరగుతున్నాయి. అయితే దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఆర్ఎఫ్కి గురికావడం వల్ల ఏర్పడి ప్రతికూల ప్రభావాలను అంచనా వేయడానికి మెటా-అనాలసిస్ పేరుతో ఆయా అధ్యయనాలను విశ్లేషించేందుకు సమీక్ష నిర్వహించారు. ఇందులో ఎక్కువగా పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలుసుకున్నారు.

2012 నుంచి 2021 మధ్య చేసిన 435 అధ్యయనాల్లో రికార్డులు, గుణాంకాలను విశ్లేషించారు. పురుషుల్లో ఎంత సేపు సెల్ ఫోన్ వాడితే వారిలో స్ఫెర్మ్ దెబ్బతింటుందో గ్రహించలేకపోయారు. కానీ మొత్తానికి పురుషుల్లో మాత్రం స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుందని తెలుసుకున్నారు. ఈ అధ్యయనాలు 2012 నుంచి జరగడం వల్ల అప్పటి ఫోన్ల రేడియేషన్ ప్రభావం.. ఇప్పటి మొబైల్ వాడకం ప్రభావంలో తేడా ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫోన్లు ఏ స్థాయిలో ఆర్ఎఫ్ఈఎమ్ డబ్ల్యూ విడుదల చేస్తున్నాయో తెలుసుకొని దానికి అనుగుణంగా అధ్యయనం జరపాల్సి ఉందని అంటున్నారు.

ఇప్పుడు అందుబాటులో ఉన్నఫోన్లు రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వాటిలోని ఆర్ఎఫ్ఈఎమ్ డబ్ల్యూ అధిక స్థాయిలో రిలీజ్ చేస్తున్నాయని కొందరు అంటున్నారు. అందువల్ల దానికి అనుగునంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల పురుషులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందనేది మాత్రం వాస్తవమేనని అంటున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు సెల్ వాడకం తగ్గించాలని అంటున్నారు. కానీ నేటి జీవితంలో ప్రతీ పని మొబైల్ తోనే ముడిపడి ఉంటోంది. అందువల్ల సెల్ ఫోన్ లేనిది ఏ పని జరగడం లేదు. అయినా అవసరాలకు మించి వాడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు.