Begin typing your search above and press return to search.
సుప్రింకోర్టుకు కేంద్రం ఎందుకు సహకరించటంలేదు ?
By: Tupaki Desk | 11 Aug 2021 11:30 AM GMTతాజా మాజీ ప్రజా ప్రతినిధుల నేర చరిత్రను బహిర్గతం చేసే విషయంలో తాజాగా సుప్రింకోర్టు కేంద్రప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. సుప్రింకోర్టు ఎన్నిసార్లు ఆదేశాలిచ్చినా కేంద్రం స్పందించటం లేదని కాబట్టి ఇలాంటి కేసుల విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని కూడా అభిప్రాయపడింది.
ప్రజా ప్రతినిధులపై నేర విచారణ స్పీడుగా జరగాలంటే ప్రత్యేక ధర్మాసనం ఉండాల్సిందే అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టంగా ప్రకటించారు. వివరాలు ఇవన్ని కేంద్రప్రభుత్వ వైఖరిపై ఎన్వీ తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు.
ప్రజా ప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను కేంద్రప్రభుత్వం న్యాయస్ధానాలకు అందిస్తుందని అనుకున్నామని చీఫ్ జస్టిస్ అన్నారు.
దేశంలోని 17 రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బీజేపీనే సారధ్యం వహిస్తోంది. తాజా, మాజీ ప్రజా ప్రతినిధుల నేరచరిత వివరాలు ఇవ్వాలంటే ఎక్కువగా బీజేపీ నేతల పేర్లే ఉండే అవకాశం ఉంది. ఈమధ్యనే జరిగిన బీహార్, పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల ఎన్నికలను తీసుకుంటే కమలం నేతలపైనే ఎక్కువ కేసులున్నట్లు బయటపడింది.
తానిచ్చిన వివరాల ఆధారంగా న్యాయస్ధానాలు చర్యలు తీసుకోవటానికి రెడీ అయితే ముందుగా ఎక్కువగా నష్టపోయేది తామేఅని బీజేపీ అగ్రనేతలకు భావించడం వల్ల వాళ్ల ఈ కేసు విషయంలో ముందు వెనుకా ఆలోచిస్తున్నట్లున్నారు. బహుశా ఈ కారణం వల్లనే నేర చరిత వివరాలను న్యాయస్ధానాలకు ఇవ్వటంలేదేమో.
ఇక హైకోర్టు అనుమతి లేకుండా ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణ కుదరదని ఇచ్చిన సుప్రీం తీర్పు రాజకీయ పార్టీలకు మింగుడు పడటం లేదు. ఎలాగంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న కారణంగానే చాలామంది రాజకీయనేతలపై ప్రభుత్వాలు కేసులు పెడుతుంటాయి. ఉదాహరణకు ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో కానీ లేదా ప్రత్యేకహోదా ఉద్యమంలో కానీ చాలామందిపై అప్పటి ప్రభుత్వాలు కేసులు పెట్టాయి.
తర్వాత ప్రభుత్వాలు మారినపుడు వాటిని ఎత్తేసుకుంటూ ఉంటారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాజకీయ పార్టీలకు సంకటంగా మారింది.
నేర స్వభావం వల్ల నమోదైన కేసులు అంటే అత్యచారాలు, హత్యాచారాలు, దోపిడీ, అవినీతి, దాడుల్లాంటి కేసుల వరకు ఈ నిర్ణయాన్ని పరిమితం చేసుంటే బాగుండేదని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. తాజా తీర్పుతో ప్రత్యర్ధులపై ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగానో లేకపోతే కక్షసాధింపుతోనే కేసులు పెడితే ఇకపై అడ్డంగా బుక్ అవుతామని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి.
ఇంకో సమస్య ఏంటంటే... సులువుగా తేలాల్సిన కేసులు కూడా వీటిలో ఉంటాయి. అయితే ఇలాంటి వేలాది కేసుల విచారణకు న్యాయస్ధానాల్లో తగిన సౌకర్యాలు లేకపోవటంతో, జడ్జిల కొరత ఉండటం వల్ల సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటున్నాయి.