Begin typing your search above and press return to search.
స్వలింగ జంటల పెళ్లిళ్లకు నో పర్మిషన్ .. స్పష్టం చేసిన కేంద్రం
By: Tupaki Desk | 14 Sep 2020 5:31 PM GMTఢిల్లీ హైకోర్టులో ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. స్వలింగ జంటల మధ్య జరిగే వివాహాలను హిందూ వివాహ చట్టం-1956 కింద గుర్తించాలని కోరుతూ LGBTQ కమ్యూనిటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. స్వలింగ జంటల మధ్య వివాహాలను రిజిస్టర్ చేయడం లేదని.. దేశవ్యాప్తంగా అలాంటి వివాహాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరింది. చీఫ్ జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ ప్రతీక్ జలాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. స్వలింగ జంటల మధ్య జరిగే వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేంటని కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి కదా అని వ్యాఖ్యానించింది. కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆలోచించ వచ్చు కదా అని కోరింది.
అయితే , కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. స్వలింగ జంటల మధ్య జరిగే వివాహాలు భారతీయ సంస్కృతి, విలువలకు విరుద్ధమని చెప్పారు. హిందూ వివాహ చట్టం-1956 లో స్వలింగ జంటల మధ్య వివాహాల ప్రస్తావన లేదని అన్నారు. ఒక ఆడ, మగ మధ్య మాత్రమే వివాహబంధాన్ని గుర్తించాలని, చట్టం చెబుతోందని ఇలాంటి వివాహాలను అనుమతించలేమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టంలో వివాహాల నియంత్రణ, వివాహేతర సంబంధాల నివారణకు పలు నిబంధనలు భార్య, భర్తల గురించి ప్రస్తావిస్తాయని స్వలింగ జంటల్లో ఈ పాత్రలను ఎలా చూస్తారని మెహతా ప్రశ్నించారు.
ప్రపంచవ్యాప్తంగా పద్ధతులు మారిపోతున్నాయని, అయితే అవి భారత్ కు వర్తించవచ్చు, వర్తింపకపోవచ్చని కోర్టు తెలిపింది. హిందూ వివాహ చట్టం-1956లో స్వలింగ, భిన్న లింగాలంటూ ఎలాంటి వివక్ష చూపలేదని, అలాగే స్త్రీ, పురుషుల మధ్య మాత్రమే వివాహం జరగాలని ఎక్కడా రాసి లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్వలింగ వివాహం చేసుకున్న జంటలు తమ పేర్లతో పాటు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన వివరాలను సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది.