Begin typing your search above and press return to search.

విదేశీ హిందువుల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం!

By:  Tupaki Desk   |   1 Nov 2022 10:30 AM GMT
విదేశీ హిందువుల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం!
X
భారత పౌరసత్వ చట్టం (సీఏఏ) దేశంలో ఎంత వివాదాస్పదమైందో తెలిసిన సంగతి తెలిసిందే. దీనిపై భారీ స్థాయిలో నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారతీయులు కాకపోయినా పాకిస్థాన్, అప్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉంటున్న హిందువులకు దేశ పౌరసత్వం కల్పిస్తూ కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అందులోనూ పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ హిందువులు కోరుకుంటే వారికి గుజరాత్‌లో నివాసం కల్పిస్తామని.. భారత్‌ పౌరసత్వం ఇస్తామని కేంద్రం తాజాగా తెలిపింది.

కాగా మనది ఏక పౌరసత్వ విధానం. అంటే దేశం మొత్తం ఒకే ఒకే పౌరసత్వం అమల్లో ఉంటుంది. అందరూ భారతీయులుగానే ఉంటారు. ఎవరికైనా విదేశీ పౌరసత్వం ఉంటే భారత్‌ పౌరసత్వం రద్దవుతుంది. భారత్‌ పౌరసత్వం కలిగి ఉంటే మరో దేశ పౌరసత్వం కలిగి ఉండటం కుదరదు.

ఇక విదేశీయులు భారత పౌరసత్వం పొందడం అంత సులువు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ పొరుగు దేశాలయిన పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మైనారిటీలుగా ఉంటున్న హిందువులకు భారత పౌరసత్వం ఇస్తామని కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఇప్పుడున్న నిబంధనల్లో మార్పులు కూడా చేయనుంది. ఈ మేరకు ఆ నిబంధనలను సవరించనుంది.

ముస్లిం దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల్లో హిందువులు అనేక వేధింపులకు గురవుతున్నారు. వారిపైన పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. దీనిపై గతంలోనే భారత్‌ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశాల్లో మైనారిటీలుగా ఉంటున్న హిందువులకు భారత్‌ పౌరసత్వం ఇవ్వాలని సంకల్పించింది.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయా దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు భారీ ఎత్తున భారత్‌కు తరలివస్తారని కేంద్రం అంచనా వేస్తోంది.
కాగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌ నుంచి భారత్‌ కు వలసవచ్చిన హిందువులకు దేశ పౌరసత్వం కల్పించే ప్రక్రియను గుజరాత్‌ నుంచి మొదలుపెడుతుండటం విశేషం.

గుజరాత్‌ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాల సొంత రాష్ట్రం కావడం గమనార్హం. బంగ్లాదేశ్, అప్గనిస్థాన్, పాకిస్థాన్‌ల నుంచి వచ్చేసినవారికి గుజరాత్‌ లోని ఆనంద్, మొహసానా జిల్లాల్లో భారత పౌరసత్వం కల్పిస్తోంది. ఈ అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతూ కేంద్ర హోంశాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గుజరాత్‌లో భారీ ఎత్తున ఈ నిర్ణయం ద్వారా ఓట్లను కొల్లగొట్టవచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా హిందువుల్లో తమ ఓటు బ్యాంకును మరింత సంఘటితంగా చేసుకోవచ్చని తలపోస్తోంది.

గుజరాత్‌ లో దీన్ని అమలు చేశాక ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం గతంలో తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని అసోంలో అమలు చేసినప్పుడు నిరసనలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టులోనూ దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.